end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంSanitary pads:బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్
- Advertisment -

Sanitary pads:బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్

- Advertisment -
- Advertisment -

  • ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ


ప్రభుత్వ పాఠశాలల్లో (Governament schools) చదువుతున్న బాలికలకు (Girls) ఫ్రీగా శానిటరీ ప్యాడ్‌ (Free sanitary pad)లు అందించాలని కోరుతూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు (Supreme Court)విచారణ జరిపింది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి (class) వరకు చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్‌లను అందించాలని, ఆ అవసరం ఎంతైనా ఉందని పిటిషన్‌ (Petition)లో తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమాధానం ఇవ్వాలని కోరింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు (doctor from Madhya Pradesh), సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ (Jaya Thakur) అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud), జస్టిస్ పిఎస్ నరసింహల (Justice PS Narasimha)తో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.

(Broccoli:బ్రోకలీ తో అద్భుతం)

ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల పారిశుధ్యం, పరిశుభ్రత ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారని, ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది. బాలికలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్యాడ్‌లు కొనే స్థోమత లేకపోవడం వల్ల పేద బాలికలు అనారోగ్యం బారిన పడుతున్నారని.. దాని వల్ల వారు చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తుందని మహిళా సంఘాల నేతలు కోరారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని స్వచ్చంద సంస్థల నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -