end
=
Wednesday, February 5, 2025
సినీమాThehar Ja:‘థెహర్ జా’ ప్రజల హృదయాలను గెలుచుకుంది
- Advertisment -

Thehar Ja:‘థెహర్ జా’ ప్రజల హృదయాలను గెలుచుకుంది

- Advertisment -
- Advertisment -


ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్(Palak Muchhal) ఇటీవల విడుదలైన తన మ్యూజిక్ వీడియో ‘థెహెర్ జా’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్(Comments) చేసింది. రిచారవి సిన్హా – ఆశిష్ భాటియా(Ashish Bhatia) నటించిన ఈ వీడియో సాంగ్ తనతోపాటు ఎంతోమంది హృదయాలను కదిలించినట్లు తెలిపింది. ‘థెహెర్ జా’తో నేను ప్రజల మనస్సులు గెలుచుకోగలనని నమ్ముతున్నా. ప్రతిభావంతులైన బృందం, అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్‌(Production House)లో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా’ అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.ఇక ఈ వీడియోలో హాట్ లుక్స్‌(Hot Looks)తో కుర్రాళ్లను అట్రాక్ట్ చేసిన రిచా.. పాలక్ పాడిన మ్యూజిక్ వీడియోలో భాగం కావడం సంతోషంగా ఉందని, తాను వ్యక్తిగతంగా పాలక్ ముచ్చల్‌కి పెద్ద అభిమానినని చెప్పింది. ‘అత్యంత ప్రసిద్ధి పొందిన గాయకురాలి పాటలో నటించడం నా అదృష్టం(Lucky)గా భావిస్తున్నా. అద్భుతమైన సాహిత్యంతో కూడిన అందమైన పాట. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. సంగీతం చాలా ఆత్మీయం(Soulful)గా ఉంది. అభిమానుల స్పందనలు చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది’ అని తెలిపింది. ఇలాసింగ్ దర్శకత్వం వహించిన ఈ సాంగ్‌కు అంకిత్ షా సంగీతం అందించారు.

https://www.instagram.com/p/Ci1cyOaK65u/?utm_source=ig_web_copy_link
https://www.youtube.com/watch?v=ocWpzkCP0-E

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -