end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయం2023: మేడారం జాతరకు ముహూర్తం ఖరారు
- Advertisment -

2023: మేడారం జాతరకు ముహూర్తం ఖరారు

- Advertisment -
- Advertisment -

  • ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ జాతర


ఆసియా (Asia) ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka, Saralamma) జాతర.. ములుగు (Mulugu) జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా (Kumbh Mela) అనే పేరుకూడా ప్రసిద్ధి. జిల్లాలోని తాడ్వాయి (Tadawai) మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది జరగనున్న మేడారం మినీ జాతరకు సంబంధించిన తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది.

ఈ మేరకు మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు (Siddha Boina Jaggarao, president of the priests association) అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరి మాఘమాసంలో నిర్వహించే మేడారం జాతర పండగ తేదీలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మండ మెలిగే మినీ మేడారం జాతర తేదీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన మేడారం ఈవో, పూజారుల సంఘం ఆ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి (February) 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు.

(Ys Sharmila:ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తప్పా?)

ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించ‌నున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌.. ప్రతి రెండేళ్లకోసారి (Every two years) మేడారం మహా జాతర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది.

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీసు అధికారులు మాక్‌డ్రిల్‌ (Macdrill) చేశారు. మేడారం మహా జాతరలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు పూర్తిచేసి సారలమ్మ, గోవిందరాజులు (Govindaraju) గద్దెలకు తీసుకోస్తారు. మొదటి రోజు కన్నెపల్లి (Kannepally) నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి (Eturnagaram Mandal from Kondai)గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి ఘట్టం పూర్తి అవుతుంది.

సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం. చిలుకలగుట్టపై (chilakamma gutta) ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. ఈ సమయంలో పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి మరీ ఘన స్వాగతం పలుకుతారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అత్యంత ఘనంగా జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలా చర్యలు చేపట్టింది.

(Revanth Reddy:సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష)

వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా (Maharashtra, Chhattisgarh, Odisha)నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. దీంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతాయి. వాహనాలతో పార్కింగ్‌ స్థలాలు నిండిపోతాయి. వీఐపీ, వీవీఐపీల (VIP, VVIP) పార్కింగ్‌ ఏరియాలు కూడా రద్దీగా మారుతుంటాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్స్‌ లేకుండా పోలీసులు చర్యలు చేపడూ వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -