end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంSI- Constable:ఎస్ఐ- కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల
- Advertisment -

SI- Constable:ఎస్ఐ- కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల

- Advertisment -
- Advertisment -


పోలీసు కొలువుల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూసే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది (AP Govt has given good news). 6511 పోస్టులతో ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది (Notification has been released for the posts of SI/Constable). దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక పోలీసు ఉధ్యోగాలకు సిద్ధంకావడమే తరువాయి.. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు అర్హతలు, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్ (Physical Test, Application Process, Syllabus) వంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం..

విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ (Intermediate) లేదా దానికి సమానమైన పరీక్ష. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థి విషయంలో, అభ్యర్థులు తప్పనిసరిగా ఎస్ఎస్‌సీ (SSC) లేదా దాని తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ చదివి 1వ సంవత్సరం, 2 వసంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఉండాలి.

వయోపరిమితి:
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఏపీ (AP) లేదా ఏపీ నివాస రుజువు (Residence proof) ఉన్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 నుంచి 32 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. నాన్ లోకల్ (Non local) అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డ్ రిజర్వ్ డ్ కేటగిరీకి (AP Recruitment Board for Reserved Category)చెందిన దరఖాస్తుదారులకు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ:
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌రిక్రూట్ మెంట్ కోసం నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) లో జరుగుతుంది. ఫలితాలు, హాల్ టికెట్ల (Results, Hall Tickets)ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది.

  1. ప్రిలిమినరీ పరీక్ష
  2. ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
  3. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
    ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులవుతారు. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. చివరగా, ఈ ఫిజికల్ టెస్ట్ (Physical Test) లలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్ష లో మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి.

పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా విధానం:
ప్రలిమినరీ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లలో ఓసీ (BC)లకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్‌సీ/ఎస్టీ/ (SC-ST)ఈఎస్ఎంలకు 30 శాతం అర్హత మార్కులు ఉంటాయి. పరీక్షను ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు (English, Urdu, Telugu)భాషల్లో నిర్వహిస్తారు.

పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ సిలబస్:
ఇంగ్లీష్
అంకగణితం (ఎస్ఎస్ సీ స్టాండర్డ్)
రీజనింగ్ పరీక్ష
మానసిక సామర్థ్యం
జనరల్ సైన్స్
భారతదేశ చరిత్ర
భారతీయ సంస్కృతి
భారత జాతీయ ఉద్యమం
భారతీయ భూగోళశాస్త్రం
రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ
జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిని కరెంట్ అఫైర్స్

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్:
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ 2022కి అర్హులు అవుతారు. అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా నిర్ధిష్టమైన శారీరక కొలతలు కలిగి ఉండాలి.

ఫిజికల్ మెజర్ మెంట్స్
పురుషులు: ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.
ఛాతి కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.

స్త్రీలు: ఎత్తు ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.
బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.

గమనిక:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలు, ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు కింది కొలతలు కలిగి ఉండాలి.

  1. పురుషులు: ఎత్తు – 160 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు
    ఛాతి- కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.
  2. స్త్రీలు: ఎత్తు – 150 సెం.మీ కంటే తక్కువ ఉండరాదు.
    బరువు- 38 కిలోల కంటే తక్కువ ఉండరాదు.

భౌతిక సామర్థ్య పరీక్ష:
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడిన తర్వాత, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ..ఫిజికల్ టెస్ట్ కు హాజరు కావాలి.

అంశం అర్హత సమయం/దూరం జనరల్ Ex-సర్వీస్‌మెన్ ఉమెన్
100 మీ పరుగు 15 సెకండ్స్ 16.5 సెకండ్స్ 18 సెకండ్స్
లాంగ్ జంప్ 3.80 మీ 3.65 మీ 2.75 మీ
1600 మీటర్లు 8 ని. 9ని. 30సెకన్లు 10ని. 30 సెకండ్స్
చివరి పరీక్ష మెయిన్స్:
చివరి పరీక్ష ఆబ్జెక్టివ్ పరీక్ష- పేపర్ లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. సమయం 3 గంటలు ఉంటుంది. చివరగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా జాబితా రూపొందిస్తారు.
గమనిక: సివిల్ కానిస్టేబుల్ లకు పురుషులు, మహిళలు అర్హులు, కాని ఏపీఎస్ పీ కానిస్టేబుల్ పోస్టులకు కేవలనం పురుషులు మాత్రమే అర్హులు.

6511 ఎస్ఐ/కానిస్టేబుల్ నోటిఫికేషన్ వివరాలు :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ (State Level Police Recruitment) బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 6511
ఎస్ఐ పోస్టులు – 315
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ – 96
కానిస్టేబుల్ (సివిల్) – 3,580
ఏపీఎస్పీ పోస్టులు – 2,520

అర్హత:
ఏదైనా గ్రాడ్యుయేషన్ /తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ టెస్ట్:
ఈ పరీక్షలో 200 మార్కులకు (Marks) 200 ప్రశ్నలు ఉంటాయి.
అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎస్ఐ అభ్యర్థులు:
దరఖాస్తు ప్రారంభతేది: డిసెంబర్ 14, 2022.
చివరితేది: జనవరి 18, 2022.
ప్రిలిమినరీ పరీక్ష తేది: ఫిబ్రవరి 19, 2023.

కానిస్టేబుల్ అభ్యర్థులు:
దరఖాస్తు ప్రారంభ తేది: నవంబర్ 30, 2022
చివరితేది: డిసెంబర్ 28, 2022.
ప్రిలిమినరీ పరీక్ష తేది: జనవరి 22, 2023
వెబ్‌సైట్: https://slprb.ap.gov.in

(Vodafone:వొడాఫోన్ సీఈఓ రాజీనామా!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -