end
=
Monday, November 25, 2024
బిజినెస్‌Stock Market:స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!
- Advertisment -

Stock Market:స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!

- Advertisment -
- Advertisment -

దేశీయ ఈక్విటీ మార్కెట్ల (Equity markets)లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గతవారం వరకు అన్ని సెషన్లలో రికార్డు గరిష్ఠాలకు చేరిన సూచీలు లాభాల స్వీకరణ కారణంగా వరుసగా మూడవ సెషన్‌లో నష్టాలను ఎదుర్కొన్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల (Fed interest rates in trading) పెంపు మరికొంత కాలం కొనసాగనుందనే సంకేతాలతో అమెరికా మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీని ప్రభావంతో గ్లోబల్ మార్కెట్ల (Global markets)లో ప్రతికూలత ఏర్పడింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల (International markets)లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, దేశీయంగా ఆర్‌బీఐ (RBI) Sసమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన ఐటీ, మెటల్ (IT, Metal)రంగాల్లో అమ్మకాలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు నీరసించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex)208.24 పాయింట్లు నష్టపోయి 62,626 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు పడిపోయి 18,642 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ (PSU Bank, FMCG)రంగాలు మాత్రమే రాణించగా, మిగిలిన రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు (Shares of Hindustan Unilever, Ultra Cement, Powergrid, Nestlé India, Axis Bank, Bajaj Finance Companies) లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, డా రెడ్డీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టాక్స్ (Tata Steel, Dr Reddy, Infosys, SBI, Bharti Airtel, ICICI Bank, IndusInd Bank, TCS, Tech Mahindra Stocks) నష్టాలను నమోదు చేశాయి.

(SI- Constable:ఎస్ఐ- కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల)

దెబ్బతిన్న రూపాయి..

అమెరికా (America) సేవల రంగ కార్యకలాపాలు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో మరికొంత కాలం ప్రస్తుత ధోరణిని కొనసాగించవచ్చనే పరిణామాల మధ్య మంగళవారం డాలర్ (Dollar) విలువ పెరిగింది. ఈ క్రమంలో భారత కరెన్సీ రూపాయి (Indian currency is rupee) విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ఏకంగా 80 పైసలు బలహీనపడి రూ. 82.63 వద్ద ఉంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయి విలువ బలహీనపడేందుకు కారణాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -