end
=
Wednesday, January 22, 2025
వార్తలురాష్ట్రీయంNirmal:నిర్మల్ జిల్లాలో ముగిసిన బండి సంజయ్ యాత్ర
- Advertisment -

Nirmal:నిర్మల్ జిల్లాలో ముగిసిన బండి సంజయ్ యాత్ర

- Advertisment -
- Advertisment -
  • బాధనకుర్తిలో ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలు


కాషాయదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ (BJP Telangana chief Bandi Sanjay) ఐదో విడత పాదయాత్ర (Fifth Padayatra) నిర్మల్ (Nirmal) జిల్లాలో విజయవంతమైంది. ఆయన కార్యక్రమం డిసెంబర్ 7న రాత్రి జిల్లా సరిహద్దుల్లో ముగిసింది. బైంసా (Bainsa) పట్టణంలో మొదలైన బండి ప్రజా సంగ్రామ యాత్ర పది రోజుల పాటు కొనసాగి ఖానాపూర్ మండలం బాదం కుర్తి (Badam Kurti of Khanapur Mandal) వద్ద ముగియగా జగిత్యాల జిల్లాలో ప్రవేశించింది. స్వాగతం మొదలు వీడ్కోలు వరకు జనం నీరాజనం పలికారు.

కాషాయ శ్రేణుల సంఘటితం:
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పది రోజులపాటు నిర్మల్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర ఆ పార్టీ శ్రేణులను సంఘటితం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గతంలో పార్టీ ఉనికి కోసం మాత్రమే అన్నట్టుగా ఉన్న బీజేపీ తాజాగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తర్వాత ఊపు మీదకు వచ్చింది. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ ఎక్కడ కూడా ఆయన పాదయాత్రకు జనం తగ్గలేదు. బైంసా, నిర్మల్ ఖానాపూర్ సభల్లో తరలివచ్చిన జనంతో కాషాయ శ్రేణులు సంబరపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి పార్టీ గణనీయంగా బలపడుతుందన్న ఆశాభావం పార్టీ శ్రేణుల్లో కనిపించింది. బండి సంజయ్ ప్రసంగాలు సైతం దేశం కోసం ధర్మం కోసం హిందూ సమాజం పరిరక్షణ కోసం (For the preservation of Hindu society for the sake of dharma for the nation) అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులతో పాటు అనుబంధ విభాగాలను ఉత్తేజితం చేశాయి. ముధోల్ నియోజకవర్గం (Mudhol Constituency)లో తొలి నుంచి పార్టీ జీవసత్వాలు కలిగి ఉన్నప్పటికీ నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గం ఆయన పర్యటన వల్ల పార్టీకి భారీగా లాభం చేకూరింది. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఆయన ప్రసంగాలు బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

(CM KCR:కంటి వెలుగు ని విజయవంతం చేయాలి)

బైంసాలో మొదలై బాదనకుర్తిలో ముగింపు:
బండి సంజయ్ పాదయాత్ర జిల్లాలోని బైంసాలో ప్రారంభమై ఖానాపూర్ నియోజకవర్గం బాదనకుర్తి వద్ద బుధవారం రాత్రి ముగిసింది. పార్టీ సీనియర్ నేతలు అందరూ బండికి వీడ్కోలు పలికారు. నిర్మల్ జిల్లాలో తన పాదయాత్రకు విశేష ఆదరణ లభించిందని నిర్మల్ జిల్లాను జీవితంలో ఎన్నటికి మరిచిపోనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్లు రమాదేవి అయ్యన్న గారి భూమయ్య డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి రావుల రామనాథ్ అప్పల గణేష్ చక్రవర్తి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ బుఖ్య జాను బాయి, హరి నాయక్ రమా రావు పటేల్ మోహన్ రావు పటేల్ (Party Seniors Ramadevi Ayyanna Gari Bhumaiya Dr. Mallikarjun Reddy Ravula Ramanath Appala Ganesh Chakraborty Former MP Rathore Ramesh Bukhya Janu Bai, Hari Naik Rama Rao Patel Mohan Rao Patel) ఇతర ముఖ్య నేతలు ఆయనకు గోదావరి (Godavari)నది వద్ద బాదం కుర్తి లో వీడ్కోలు పలికారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -