- బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ నుంచి దరఖాస్తులు
తెలంగాణ (Telangana) రాష్ర్టం కరీంనగర్ (Karimnagar), వనపర్తి (Vanaparty)లలోని మహాత్మా జ్యోతిబా ఫులె (Mahatma Jyotiba Phule) బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాల (BC Welfare Agricultural Women’s Degree Gurukula College)ల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ టీచింగ్ అసోసియే (Guest Teaching Associate)ట్ ఖాళీల భర్తీకి మహాత్మా జ్యోతిబా ఫులె తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (BC Welfare Residential Education Institution Society) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గెస్ట్ టీచింగ్ అసోసియేట్ – 20 పోస్టులు
విభాగాలు: అగ్రోనమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్..
అర్హత: ఎంఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు పీహెచ్ డీ అభ్యర్థులకు రూ. 45,000 పీజీ అభ్యర్థులకు రూ. 40,000 ఉంటుంది.
ఇంటర్వ్యూ తేది: 14, 15 డిసెంబర్ 2022.
వేదక : 6వ అంతస్తు, డీఎస్ఎస్ భవన్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్.
చివరితేది: డిసెంబర్ 9, 2022.
వెబ్‌సైట్: http://mjptbcwreis.telangana.gov.in