end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంHimachal pradesh:హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు
- Advertisment -

Himachal pradesh:హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు

- Advertisment -
- Advertisment -

  • ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి
  • కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం
  • నేడే ప్రమాణస్వీకారం
  • ప్రతిభా సింగ్ మద్దతుదారుల నిరసనలు


హిమాచల్ ప్రదేశ్‌(Himachal pradesh)అసెంబ్లీ (Assembly)ఎన్నికల్లో కాంగ్రెస్ (Cogress)గెలిచినప్పటికీ నుంచి తదుపరి సీఎం (CM) ఎవరన్నదానిపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్విందర్ సింగ్ సుఖు(Congress leader Sukhwinder Singh Sukhu is the new Chief Minister of the state) ఎంపికయ్యారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీనిపై పార్టీ పరిశీలకుల్లో ఒకరైన ఛత్తీస్‌గఢ్ సీఎం భుపేశ్ బఘెల్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాధికారాన్ని సీఎల్పీ (CLP)అధిష్టానికే అప్పగించడంతో, హైకమాండ్ సుఖు పేరును ఖరారు చేసిందని చెప్పారు. అలాగే, ఇంతకుముందున్న బీజేపీ (BJP) ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న ముకేశ్ అగ్నిహోత్రి (Mukesh Agnihotri)ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. నూతన ముఖ్యమంత్రి సుఖు, డిప్యూటీ సీఎం ముకేశ్ (Sukh, Deputy CM Mukesh) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారని వెల్లడించారు. కాగా, సీఎం ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర నాయకులు రాజీవ్ శుక్లా, భూపేందర్ హుడా, భూపేశ్ బఘేల్ (Rajeev Shukla, Bhupinder Hooda, Bhupesh Baghel) సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, సీఎం పదవి కోసం సుఖు సహా నలుగురు నేతలు పోటీలో ఉండటంతో సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఏక వాక్యతీర్మానం చేసి సీఎం ఎంపికను అధిష్టానానికే వదిలేశారు. హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలు (MLA) ఏకగ్రీవంగా తీర్మానించారని రాజీవ్ శుక్లా (Rajeev Shukla) చెప్పారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కలుగజేసుకుని తాజా నిర్ణయాన్ని వెలువరించింది.

ఎవరీ సుఖు?
సీఎం (CM) గా బాధ్యతలు చేపట్టనున్న సుఖ్విందర్ సింగ్ (Sukhwinder Singh).. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుఖు.. పార్టీ అగ్రనేత రాహుల్‌కు (Rahul) సన్నిహితుడిగా పేరుంది. హమిర్‌పుర్ జిల్లా నాడాన్‌ (Hamirpur District Nadan)కు చెందిన సుఖు.. తన కాలేజీ రోజుల్లోనే కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (National Student Union of India) (NSUI) చేరారు. అందులో మంచి పేరు తెచ్చుకున్న సుఖు.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 1998లో యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2008 వరకు నిర్వర్తించారు. 2013లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమయ్యారు. 58ఏళ్ల సుఖు తన రాజకీయ ప్రయాణంలో 2003 నుంచి ఇప్పటివరకు నాడాన్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్‌ (Vijay kumar)పై 3వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన తండ్రి ఆర్టీసీ (RTC Driver) డ్రైవర్. చదువుకునే సమయంలోనే సుఖు ఓ పాలకేంద్రాన్ని నడిపేవారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ (MA), ఎల్ఎల్‌బీ (LLB) పట్టా అందుకున్న సుఖు.. షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌ (Shimla Municipal Corporation)కు రెండుసార్లు కౌన్సిలర్‌ (Councillor)గానూ ఎన్నికవడం విశేషం.

ప్రతిభా సింగ్‌ (Pratibha Singh)కు నిరాశ
నిజానికి సీఎం ఎంపిక పార్టీ అధిష్టానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ పదవి కోసం పోటీలో సుఖ్విందర్‌తోపాటు రాష్ట్ర పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ (PCC chief Pratibha Singh), ముకేశ్ అగ్నిహోత్రి, హర్షవర్ధన్ చౌహాన్ (Mukesh Agnihotri, Harshavardhan Chauhan) బరిలో ఉన్నారు. వీరిలో పార్టీ చీఫ్, దివంగత సీఎం వీరభద్రసింగ్ (Virbhadra Singh) సతీమణి, మూడు సార్లు ఎంపీగా గెలిచిన ప్రతిభా సింగ్‌కే ఈ అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఆమెకే పట్టం కట్టాలని కోరుతూ ఆమె మద్దతుదారులు సైతం శుక్రవారం రాత్రి వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. కానీ, అంతలోనే కథ అడ్డం తిరగడం గమనార్హం. ఆమెను పక్కనబెట్టి సుఖుకు అవకాశం ఇచ్చారు. కాగా, సీఎంగా సుఖు పేరును అధిష్టానం ప్రకటించగానే.. శనివారం సైతం ఆమె మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా, 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు సాధించగా బీజేపీ 25 స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.

(Visakhapatnam:నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -