end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంGujarat:గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
- Advertisment -

Gujarat:గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్

- Advertisment -
- Advertisment -

  • రేపే ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం


గుజరాత్ (Gujarat) ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించడంతో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) మరోసారి సీఎంగా నామినేట్ అయ్యారు. శనివారం రాష్ట్ర ఎమ్మెల్యేలు (MLA) భూపేంద్రను సీఎంగా కొనసాగేందుకు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పటేల్ పేరును కను దేశాయ్ (Kanu Desai) ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh), కర్ణాటక మాజీ సీఎం యడియురప్పా (Former Karnataka CM Yeddyurappa), బీజేపీ సీనియర్ నేత అర్జున్ ముండా (Senior BJP leader Arjun Munda)హజరయ్యారు. ఎమ్మెల్యేల అంగీకారంతో భూపేంద్ర వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం దీనికిగానూ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. గురువారం వెలువడిన ఫలితాల్లో కనివినీ ఎరుగని రీతిలో బీజేపీ 156 సీట్లలో గెలుపొంది అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఉన్న కాంగ్రెస్ అత్యధిక సీట్ల(149) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాకుండా వరుసగా ఏడు సార్లు అధికారం చేపట్టి సంచలనం సృష్టించింది.

(Group 4:TSPSC నుంచి 9,168 గ్రూప్- 4 పోస్టులకు నోటిఫికేషన్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -