- కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు
- చర్యలకు ఆదేశించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- తన ఉద్దేశం ఎన్నికల్లో ఓడించడమన్న రాజా పటేరియా
కాంగ్రెస్ నేత రాజా పటేరియా(King Pateria) ప్రధానిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. రాజ్యాంగాన్ని రక్షించాలని అంటే ప్రధాని మోడీ(PM MODI)ని చంపడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ గా మారడంతో బీజేపీ(BJP) తీవ్రంగా విరుచుకపడింది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజమైన తత్వం బయటపడిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్(Shivraj Singh Chauhan) అన్నారు. ఇది ప్రధానిపై ఆ పార్టీకి ఉన్న విద్వేషమని మండిపడ్డారు. కాంగ్రెస్ మహత్మ గాంధీ పార్టీ కాదని ఇటలీదని, ముస్సోలిని భావజాలం ఉందని మధ్యప్రదేశ్ హోంమంత్రి(MP Home Minister) నరోత్తమ్ మిశ్రా అన్నారు. పటేరియా వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్పీకి సూచించినట్లు చెప్పారు.అయితే తన వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రధానిని ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అయితే దీనిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని సోమవారం పేర్కొన్నారు. అది ఫ్లోలో జరిగిపోయింది. అయితే కేవలం ఈ వ్యాఖ్యలను మాత్రమే హైలెట్(Highlight) చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానిపై రాజా చేసిన వ్యాఖ్యలు క్షమించారని నేరమని కేంద్ర మంత్రి ప్రహ్లద్ వెంకటేష్ జోషి(Union Minister Prahlad Venkatesh Joshi) అన్నారు.