end
=
Saturday, November 23, 2024
వార్తలుఅంతర్జాతీయంCondom:ఉచితంగా కండోమ్స్ పంపిణీ
- Advertisment -

Condom:ఉచితంగా కండోమ్స్ పంపిణీ

- Advertisment -
- Advertisment -
  • సంచలన నిర్ణయం తీసుకున్న ఫ్రాన్స్


సాధారణంగా ఇండియాలో (India) కండోమ్స్ (Condoms) కొనేందుకు సంశయిస్తుంటారు. ఫార్మసీ (Pharmacy) కి వెళ్లినా దాన్ని ఎలా అడగాలో తెలియక తటపటాయిస్తుంటారు. కానీ ఈ విషయంలో ఫ్రాన్స్ (France) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఫార్మసీలలో స్వేచ్ఛగా, ఉచితంగా కండోమ్‌లు తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చింది. లైంగిక (sexual) సంక్రమణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్న దేశం.. వచ్చే ఏడాది నుంచి ఆ దేశ యువకులకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (President Emmanuel Macron) అధికారికంగా ప్రకటించారు. యూత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫార్మసీలలో జనవరి 1 నుంచి.. 18-25 సంవత్సరాల వయసు గల వారికి కండోమ్‌లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

వాప్తవానికి 2030 నాటికి ఫ్రాన్స్‌ను ‘జీరో న్యూ హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్స్’ (‘Zero New HIV Infections’)గా చూడాలని మాక్రాన్ (Macron) కలలు కన్నారు. ఈ క్రమంలోనే AIDS, STIలకు వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నాలలో భాగంగా డిసెంబర్ 2018 నుంచి ఫ్రెంచ్ సోషల్ సెక్యూరిటీ (French Social Security) ద్వారా కండోమ్స్ ఇప్పటికే రీయింబర్స్ చేయబడ్డాయి. మెడికల్ ప్రిస్క్రిప్షన్ (Medical prescription) ఉన్న మైనర్‌లకు కండోమ్‌లు ఉచితంగా అందించబడ్డాయి. కానీ 2020-2021 రెండింటిలోనూ దేశవ్యాప్తంగా STDల రేటు సుమారు 30 శాతం పెరిగిందని ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు అంచనా వేశారు.

ఇందుకు కారణం ఈ పథకాలు గురించి పెద్దగా అవగాహన లేకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. ఫ్రెంచ్ అధ్యక్షుడి కార్యాలయం ప్రకారం.. మైనర్‌లలో 21 శాతం, 18-24 సంవత్సరాల వయసు గల వారిలో 29 శాతం మందికి మాత్రమే వీటి గురించి తెలుసు. దీంతో క్లామిడియా, గోనేరియా (Chlamydia, Gonorrhea) వంటి STIలు యువతలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల పురుషులలో 2017-19 మధ్య 45 శాతం పెరుగుదల ఉంది. 2021లో కొత్త HIV నిర్ధారణల సంఖ్య కూడా దాదాపు 5,000 వద్ద నిలిచిపోయింది.

(WHO: తీవ్రమైన ఉష్ణోగ్రతలే గుండె జబ్బులకు కారణం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -