end
=
Friday, November 22, 2024
సినీమాAnjali: హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్
- Advertisment -

Anjali: హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్

- Advertisment -
- Advertisment -

మన సోషల్ మీడియా(Social Media) లో పుకార్లు సహజం. ముఖ్యంగా సెలబ్రెటీల(Celebrity)కు ఈగోల మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే చాలావరకు ఇవన్నీ విని నవ్వుకోవటం అలవాటు చేసుకున్నారు మన సెలబ్రెటీలు అలాగే పెద్దగా పట్టించుకోరు కూడా. పీకల మీదకు వస్తే తప్ప రూమర్స్(Rumours) కి అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు. అయితే తాజాగా నటి అంజలి తనపై గత కొద్దీ రోజులుగా వస్తున్న పెళ్లి, ప్రేమ, బ్రేకప్(Breakup) పుకార్లపై ఎట్టకేలకు నోరు విప్పింది. అంతా ట్రాష్ అంటూ కొట్టి పారేసింది. తానూ నటించిన ‘ఫాల్’ చిత్ర ప్రమోషన్స్(Movie Pramotion) లో పాల్గొన్న హీరోయిన్ అంజలి రూమర్స్ కి చెక్ పెట్టింది. తనకి పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తూనే.. తనకి నచ్చిన వరుడు దొరికినప్పుడే పెళ్లి అనేసింది. గత కొద్దిరోజులుగా అమెరికాలో సెటిల్ అయినా బిజినెస్ మెన్(Businessman) తో అంజలి(Anjali) వివాహం అంటూ కోలీవుడ్ లో తెగ వార్తలొచ్చాయి. అయితే ఎక్కడ ఈ రూమర్స్ పై నోరు మెదపని అంజలి ఫాల్ ప్రమోషన్స్ లో తన పెళ్లి వార్తలు ఫేక్ అనేసింది. అయితే అంజలి ఇక్కడితో ఆగకుండా మీడియాకి మరొక మసాలా న్యూస్ ఇచ్చింది. పెళ్లి వార్తా డైవర్ట్(Divert) చేయడానికో లేక నిజమో కానీ తానూ ఒకడి ప్రేమలో ఘోరంగా మోసపోయినట్టు చెప్పి షాక్ ఇచ్చింది.

మీడియా(Media) అడగకముందే తన బ్రేకప్ ట్రాజడీని(Tragedy) రివీల్ చేసింది. గతంలో తాను ఓ వ్యక్తితో ప్రేమ(Love)లో ఉన్నట్టు  వెల్లడించింది అంజలీ. అయితే అది ఓ విషపూరిత బంధం అని.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకు.. ఆ వ్యక్తి వల్ల నిరాశ ఎదురయ్యిందని చెప్పింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం తానూ చెప్పానని వెల్లడించింది. ఆ బంధానికి అక్కడితో బ్రేక్ పడింది కాబట్టి పేర్లు అనవసరం అంటూ అంజలి వ్యాఖ్యానించింది. ఇక జర్నీ ఫేమ్ జైతో రిలేషన్ లో ఉన్నానంటూ కూడా వస్తున్న పుకార్లపై అంజలి స్పందించిది. ఇండస్ట్రీలో తనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారని.. నేను ఎవరితో స్నేహంగా ఉంటాననేది నా వ్యక్తిగత అంశమని.. నేను పలానా  హీరోతో రిలేషన్(Relation) లో ఉన్నానని ఎప్పుడు  చెప్పలేదుగా అంటూ తన రిలేషన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది నటి అంజలి. ఏదేమైనా ప్రేమ, పెళ్లి పక్కనపెడితే.. అంజలి చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. ఎవరు అంజలిని అంతలా మోసం చేసి వాడుకున్నారో అంటూ చర్చించుకుంటున్నారు.

(Love story:నరేష్‌-పవిత్రల జీవితంపై బయోపిక్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -