end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంPataan:షారుఖ్-దీపికల దిష్టిబొమ్మలు దగ్ధం
- Advertisment -

Pataan:షారుఖ్-దీపికల దిష్టిబొమ్మలు దగ్ధం

- Advertisment -
- Advertisment -

  • ఆగ్రాలో బేషరమ్ సాంగ్‌పై పెద్ద ఎత్తున నిరసనలు


బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్- దీపికలు (Shahrukh Khan- Deepika)నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ (Pataan)విమర్శలపాలవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ‘బాయ్ కాట్’ (Boy cott) చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ మతాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ దేశభక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ (Besharam rang) సాంగ్‌ను వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్రాలో (agra) పలు హిందు సంస్థలు సినిమా హీరో షారుఖ్ ఖాన్, హిరోయిన్ దీపికా పడుకొనే దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. హిందువుల (Hindu)మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకోమని అన్నారు. అంతేకాకుండా స్థానికంగా సినిమాను ఆడనివ్వబోమని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం బాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిందని ఆరోపించారు.

అయితే సినిమాలు కేవలం ఫిక్షనల్ వినోదాన్ని అందించే మాధ్యమాలని, ఏదైనా కమ్యూనిటీని దెబ్బతీసేలా ఉంటే సెన్సార్ సర్టిఫికెట్ (Censor Certificate) ఇవ్వొద్దని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా (Congress MP Rajeev Shukla) షారుఖ్ ఖాన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశభక్తుడని, అతని కుటుంబం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. షారుఖ్ ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉంటారని పేర్కొన్నారు. కాగా, బేషరమ్ సాంగ్‌లో దీపికా వస్త్రాధారణ హిందు వర్గాన్ని కించపరిచేలా ఉందని నిరసనలు వెల్లువెత్తాయి.

ఇక సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా (Mukesh Khanna).. ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌లో దీపిక డ్రెస్సింగ్‌పై దారుణంగా విరుచుకుపడ్డాడు. ఇది నిజంగానే ‘అసభ్యకరమైనది’ అంటూ తనదైన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు. అంతేకాదు పెద్ద స్క్రీన్‌పై బట్టలు లేకుండా నటీనటులను మేకర్స్ చూపిస్తున్నపుడు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ (Central Board of Film Certification) (CBFC) కంట్రోల్ చేయకుండా ఏం చేస్తుందని ప్రశ్నించాడు. ‘సినీ పరిశ్రమ గాడి తప్పింది. దానికి మతపరమైన సమస్యతో సంబంధం లేదు. ఇది వందశాతం అసభ్యతే. స్పెయిన్ లేదా స్వీడన్ (Spain or Sweden) లాంటి సంస్కృతిని మన దేశం అనుమతించదనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇలాంటి పరిమిత దుస్తులతో ప్రజల ముందుకు రావడానికి ఎలా ధైర్యం చేశారు. తొందరలోనే మేకర్స్ నటీనటులను బట్టలు లేకుండానే చూపిస్తారనిపిస్తోంది. సినిమాలు ఎవరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలను దెబ్బతీయకుండా చూసుకోవడమే సెన్సార్ బోర్డ్ పని. హింసకు ప్రేరేపించే చిత్రాలను సెన్సార్ పాస్ చేయకూడదు. యువతను తప్పుదోవ పట్టించకండి’ అంటూ రీసెంట్ ఇంరాక్షన్‌లో సీరియస్ అయ్యాడు.

(Aahwanam Resorts :ముఖ్యఅతిధిగా సినీ నటి ధమాక ఫేం శ్రీలీల..)

అలాగే షారుఖ్ ఖాన్‌పై దాడిచేస్తున్న ట్రోలర్స్‌పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ ధోలాకియా (Bollywood filmmaker Rahul Dholakia) దారుణంగా విరుచుకుపడ్డాడు. మూర్ఖత్వపు సిద్ధాంతాల మతోన్మాదులే షారుఖ్‌తోపాటు తన సినిమా ‘పఠాన్‌’ టార్గెట్ చేసి ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత దాడి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలోనే నటుడికి ఇండస్ట్రీనుంచి ప్రతి ఒక్కరూ మద్దుతు ఇవ్వాలని సినీ సోదరులను కోరుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసిన రాహుల్.. ‘@iamsrkపై కొనసాగుతున్న ద్వేషపూరిత దాడిని సినీ పరిశ్రమలోని అందరూ ఖండించాలి. SRK భారతదేశ వినోద పరిశ్రమకు అంబాసిడర్‌గా, సోదరభావానికి ప్రతీకగా ఎంతో సహకారం అందించాడు. కాబట్టి మూర్ఖపు సిద్ధాంతాలున్న ఈ మతోన్మాదులకు దయచేసి నోరుమూయమని చెప్పండి!’ అంటూ రాసుకొచ్చాడు.

ఇదిలావుంటే సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు ప్రెసిడెంట్ సయ్యద్ అనాస్ అలీ (Madhya Pradesh Ulema Board President Syed Anas Ali).. పఠాన్లు అత్యంత గౌరవప్రదమైన ముస్లిం వర్గాల్లో ఒకరు. ఈ సినిమాతో పఠాన్‌లనే కాదు మొత్తం ముస్లిం సమాజాన్ని పరువు తీస్తున్నారు. మహిళలు అశ్లీల నృత్యాలు చేయించి పఠాన్‌లను తప్పుగా చిత్రీకరించారు. ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మేము అనుమతించట్లేదు’ అని స్పష్టం చేశాడు. ఈ సినిమా పాటపై ఇండోర్‌తో సహా పలు చోట్ల నటీనటుల దిష్టిబొమ్మలను కూడా తగులబెట్టడంతోపాటు థియేటర్లను కూడా తగలబెట్టండి అని అయోధ్య మహంత్ (Mahant of Ayodhya) సూచించడం విశేషం. కాగా ఈ సినిమా జనవరి 25న విడుదలకానుంది.

(Anjali: హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -