end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంRohith Reddy:బండి సంజయ్‌కి  రోహిత్ రెడ్డి సవాల్
- Advertisment -

Rohith Reddy:బండి సంజయ్‌కి  రోహిత్ రెడ్డి సవాల్

- Advertisment -
- Advertisment -

‘సవాల్‌ని స్వీకరించలేదంటే ఆరోపణల్లో నిజం లేనట్టేగా..’

బెంగుళూరు డ్రగ్స్(Drugs) కేసులో  తనకు ఎలాంటి ప్రమేయం లేదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(MLA Rohit Reddy) స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..  ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎప్ఐఆర్‌లలో తన పేరు లేదన్నారు. కర్ణాటక పోలీసులు తనను ఏనాడూ విచారణకు రావాలని కోరలేదని వివరించారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ తమ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటుందని, తమకు అనుకూలంగా లేని రాజకీయ, వ్యాపార ప్రముఖుల్ని బీజేపీ(BJP) లక్ష్యంగా చేసుకుంటుందన్నారు.  తనకు ఈడీ నోటీసుల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.  మతం(Religion) పేరుతో ప్రజలన్ని బీజేపీ రెచ్చగొడుతుందని రోహిత్ రెడ్డి విమర్శించారు.

బెంగుళూరు(Banglore) డ్రగ్స్ కేసులో  తన ప్రమేయంపై ఆరోపణలను రుజువు చేయాలని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి  రోహిత్ రెడ్డి నిన్న సవాల్ చేశారు. ఈ విషయమై ఇవాళ ఉదయం వరకు డెడ్ లైన్(Dead Line) విధించారు. ఈ సవాల్‌లో భాగంగానే ఇవాళ మరోసారి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. బండి సంజయ్,  రఘునందన్ రావు చేసిన విమర్శలపై  కౌంటర్ ఇచ్చారు. తాను చేసిన సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదంటే  తనపై చేసిన  ఆరోపణలు నిజం కాదని  తేలిందన్నారు.  తనపై రఘునందన్ రావు(Raghunandan Rao) చేసిన విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ.. రఘునందన్ రావు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని  ఆయన ప్రశ్నించారు.  న్యాయం చేయాలని  తన వద్దకు  వచ్చిన మహిళను రఘునందన్ రావు  కాటు వేశారని ఆరోపించారు. తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిశ్రమల యజమానులను రఘునందన్ రావు బెదిరించలేదా అని ఆయన అడిగారు. ఎంఐఎం నేతల తరపున రఘునందన్ రావు వకాల్తా పుచ్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. దొంగస్వాములతో  సంబంధం లేకపోతే  బీజేపీ నేతలు ఎందుకు కోర్టులో కేసులు వేస్తున్నారో చెప్పాలని  రోహిత్ రెడ్డి ప్రశ్నించారు.

(mallanna jātara:స్వామివారికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -