end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంRahul gandhi:‘హిందీ’ కాదు.. ఇంగ్లీష్‌ కావాలి
- Advertisment -

Rahul gandhi:‘హిందీ’ కాదు.. ఇంగ్లీష్‌ కావాలి

- Advertisment -
- Advertisment -

  • ప్రపంచంతో మాట్లాడలంటే ఆంగ్లం కావాలన్న రాహుల్
  • బీజేపీ నేతల పిల్లలంతా ఇంగ్లీష్‌ చదువుతున్నట్లు వెల్లడి


ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయా (International)అవగాహన పెంచుకోవాలన్నా.. ఇతర దేశస్తులతో మాట్లాడాలన్న ఇంగ్లీష్ (English)కావాలని కాంగ్రెస్ (Congress)నేత రాహుల్ గాందీ (Rahul gandhi)అన్నారు. అయితే మన దేశంలో బీజేపీ (BJP) చెబుతున్నట్లు కేవలం హిందీ నేర్చుకుంటే దేశం దాటి వెళ్లి బతకలేమని ఎద్దేవ చేశారు. అలాగే ఇతరులు ఎవరితోనైనా మాట్లాడాలంటే హిందీతో సాధ్యం కాదని.. ఇంగ్లి్‌షతో మాత్రమే సాధ్యమని అన్నారు. హిందీ, తమిళం ఇతర భాషలు చదవొద్దని తాను చెప్పడం లేదని, ఇంగ్లిష్‌ మాత్రం ముఖ్యమని వివరించారు. ఇంగ్లి్‌షకు వ్యతిరేకంగా మాట్లాడే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, (Home Minister Amit Shah)ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు (CM), ఎమ్మెల్యే (MLA)లు, నాయకులు వారి పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం బడుల్లోనే చదివిస్తున్నారని ధ్వజమెత్తారు.

భారత్‌ జోడో యాత్ర ( Bharat Jodo Yatra) రాజస్థాన్‌ (Rajasthan)లో సొమవారం తిరిగి (Restart) ప్రారంభమైంది. సాయంత్రం ఆల్వార్‌ (Alwar)లో జరిగిన సభలో (Meeting) రాహుల్‌ మాట్లాడారు. రాజస్థాన్‌ మంత్రులంతా నెలకోసారి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్‌ పిలుపిచ్చారు. విద్వేషాన్ని వెదజల్లుతున్నారంటూ బీజేపీ (BJP)నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాను ప్రేమను పంచడానికే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ (From Kanyakumari to Kashmir) వరకూ నడుస్తున్నానని స్పష్టం చేశారు. ‘నువ్వు ఏం చేస్తున్నావ్‌. ఎందుకు పాదయాత్ర చేపట్టావు’ అని బీజేపీ నేతలు కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ద్వేషపూరితం చేసే ఒక మార్కెట్‌ (Market)లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచానని వారికి చెబుతున్నా. మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌, నెహ్రూ, ఆజాద్‌ (Mahatma Gandhi, Sardar Patel, Nehru, Azad)తదితరులంతా కూడా ఇలాగే ప్రేమను పంచే పనిచేశారు. వారి దారిలోనే నేనూ నడుస్తున్నా’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సిక్కు (Delhi Sikh) వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న జగదీష్‌ టైట్లర్‌ (Jagdish Tytler) భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడంపై బీజేపీ ధ్వజమెత్తింది. ‘ఈ నడక దేశం కోసం కాదు. ద్వేష భావాన్ని పెంచడానికి చేస్తున్నది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల (Anti Sikh riots)లో పాత్రధారులతో కాంగ్రెస్‌ ఇప్పటికీ కలిసే ఉంది’ అని మండిపడింది.

(Delhi:ఢిల్లీలో 50వేల మంది రైతుల నిరసన)

అయితే ఇంగ్లీష్ చదువుల (English education)పై రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలను వివరిస్తూ ‘హిందీ, తమిళం (Hindi and Tamil) వంటి ఇతర ప్రాంతీయ భాషలలో చదవకూడదని నేను చెప్పడం లేదు. కానీ ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి’’ అని అన్నారు. రాజస్థాన్‌లో దాదాపు 1,700 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను(English medium schools) ప్రారంభించినట్లు రాహుల్ తెలిపారు. ‘పేద విద్యార్థులు ఇంగ్లీష్ విద్యను అభ్యసించి అమెరిక (AMERICANS)న్లతో పోటీ పడాలి. రాజస్థాన్‌లో 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ (Wayanad MP) రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని ఇతర భాషలవారితో మాట్లాడాలని మీరు అనుకుంటే మీకు హిందీ పనికిరాదు, కానీ మీకు ఇంగ్లీష్ పని చేస్తుంది. దేశంలోని రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లీష్ విద్యను నేర్చుకొని అమెరికన్లతో పోటీపడాలని, వారిని వారి భాషతోనే ఓడించాలని మేము కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా బీజేపీ నేతలందరి (All BJP leaders including Union Ministers, Chief Ministers, MPs and MLAs)పిల్లలు ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు వెళతారు. రైతుల పిల్లలు (Children of farmers) ఇంగ్లీషు మీడియంలో చదవకూడదని బీజేపీ కోరుకుంటోంది. ఎందుకంటే మీరు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆ పార్టీకి ఇష్టం లేదు’ అని రాహుల్ బీజేపీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -