end
=
Friday, November 1, 2024
వార్తలుజాతీయంపోలీసులు ‘ప్రాథమిక హక్కులు’ ఉల్లంఘిస్తున్నారా?
- Advertisment -

పోలీసులు ‘ప్రాథమిక హక్కులు’ ఉల్లంఘిస్తున్నారా?

- Advertisment -
- Advertisment -

  • ‘సోషల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ ఏం చెబుతోంది?
  • తెలంగాణ స్టేట్ డైరెక్టర్ కొంకట శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ

Human Rights Council : ప్రాథమిక హక్కుల ఉల్లంఘన (Violation of fundamental rights)ను మానవ హక్కుల ఉల్లంఘన అని కూడా అంటారు. మానవహక్కులు అనేవి ఒక దేశానికో, ఒక వర్గానికి, ఒక జాతికో సంబంధించిన సమస్య కాదు. మానవ హక్కులు ఉల్లంఘన అనేది మనందరికీ సంబంధించిన విషయం. ప్రపంచంలో 1948 సంవత్సరంలో మానవహక్కుల రక్షణ కోసం చట్టం చేయబడింది. మన దేశంలో 1993 సంవత్సరం అమలులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andrapradesh)రాష్ట్రంలో 2005 సంవత్సరం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ ఏర్పడింది. పోలీసువ్యవస్థ మనకి బ్రిటిషు (British)వారి నుంచి సంక్రమించగా మానవ హక్కులను గౌరవించాలన్న భావన పోలీసులకు లేదు. బ్రిటిష్ వారు మన స్వేచ్ఛను అణగ దొక్కడానికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగించేవారు. మన దేశంలో పోలీసు వ్యవస్థ ఇలాగే తయారయిందంటున్నారు ‘సోషల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ (Social Justice for World Human Rights Council) సభ్యులు.

ముద్దాయిలకు సంకెళ్లు తొడగొచ్చా?
ముద్దాయిగా ఉండి అనారోగ్యంతో ఏ హాస్పిట (Hospital) ల్లోనైనా చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు (shackles)వేయరాదు. శిక్ష పడిన ఖైదీలకు, విచారణలో ఖైదీలకు జైల్లో (JAIL)ఉన్నపుడు కోర్టుకి (Court)తీసుకెళ్లేటప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకుతీసుకెళ్లినప్పుడు, సంకెళ్లు(బంధనాలు) వేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు (Suprim court)పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆధారాలు ఉన్నపుడే బంధించాలని తెలిపింది. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రాతపూర్వకంగా అనుమతి పొందాలి. అలాగే హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో ముద్దాయిలకు సంకెళ్లు వేయమని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు. అలాగే కోర్టుముందు హాజరుపరిచిన ముద్దాయిలను జ్యుడీషియల్ కస్టిడీ(Judicial Custody)కి పంపించినా.. లేక పోలీసు కస్టిడీకి ఇచ్చినా, మేజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు.

వారెంట్ కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకొవాలా?
ఎవరైనా వ్యక్తిని పోలీసులు వారెంట్ (Warrant) లేకుండా అరెస్టు చేసినప్పుడు పై మార్గదర్శక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని అవసరమని భావించినప్పుడు మాత్రమే సంకెళ్లు వేయడానికి అవకాశం ఉంది. ఒక ప్రదేశం నుంచి పోలీసుస్టేషన్ల వరకుగానీ, పోలీసు స్టేషన్ల నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకొని వెళ్లేంతవరకు మాత్రమే సంకెళ్లు వేయాలి. మరల కూడా సంకెళ్లు వేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి. ఈ విషయం అన్ని హోదాలో ఉన్న పోలీసు వారికి వర్తిస్తుంది. ఒక వేళ సంకెళ్ళు వేస్తే కోర్టుధిక్కరణ నేరమని ‘సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసివర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం జార్జిమెంట్’ 1995 సం.లో స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందకుండా సంకెళ్లు వేస్తే పోలీసులతో పాటు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హులుగా పరిగణించబడతారు. నష్టపరిహారం కూడా వేయవచ్చు. రాజ్యాంగంలోని అధికరణలు 14,19,21 ప్రకారం సంకెళ్లు వేయడం నేరం. చట్ట విరుద్ధం.

అరెస్టు చేసినప్పుడు సంకెళ్లు వేయవచ్చు అని ఏ చట్టంలో పేర్కొనలేదు కదా?
మన భారతీయ చట్టాలలో అరెస్టు అంటే ఏమిటో పూర్తిగా ఎక్కడ నిర్వచించలేదు. ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం, అతన్ని కదిలికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉండాలాని సుప్రీంకోర్టు 1953 సంవత్సరంలో స్పష్టం చేసింది.

అరెస్టు ఉద్దేశ్యం 2 రకాలు:
1) అతని/ఆమెపై ఉన్న క్రిమినల్ (Criminal) ఆరోపణలపై కోర్టులకు జవాబు చెప్పాలి.
2) అతను/ఆమె ఏదైనా నేరం చేయకుండా అరెస్ట్ చేయాలంటే శరీరాన్ని తాకడం ద్వారా, నిర్బంధించడం ద్వారా చేయవచ్చు. అలాంటి సమయంలో నిన్ను అరెస్టు చేస్తున్నామని మాటల ద్వారా చెప్పాల్సి ఉంటుంది.

సంకెళ్లు ఎప్పుడు వేస్తారు?
ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్ళునప్పుడు సాధారణంగా సంకెళ్లు వేస్తారు. సంకెళ్లు సాధారణ పరిస్థితుల్లో వేయరాదు. అరెస్టు విషయంలో అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రింకోర్టు జోగిందర్ కుమార్ ఓ కేసులో స్పష్టం చేశాడు. అరెస్టు చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి కోరినప్పుడు అతని బంధువులనుగాని, న్యాయవాదినిగానీ లేదా అతడి ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనా అతను సంప్రదించే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి. కస్టడీ ఎవరిని చిత్రహింసలు పెట్టరాదు. ఒకవేళ చిత్రహింసలు గురిచేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే. కస్టడి మరణం కన్న అతి ఘోరమైన నేరం మరొక్కటి లేదు. కోర్టు అనుమతి లేకుండా సంకెళ్లు వేస్తే అలాంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అరెస్టుల విషయంలో మార్గదర్శకాలు:
1) అరెస్టు లేదా ఇంటరాగేషన్ (Intaragation)చేసినప్పుడు పోలీసు అధికారులు తమపేరు హోదాగల పేరున్న ప్లేట్లను (గుర్తింపు) ధరించాలి. అది ఖచ్చితంగా గుర్తించుటకు వీలుగా ఉండాలి. అరెస్టు ఇంటరాగేషన్ పాల్గొన్న అధికారుల వివరాలు ఈ రిజిస్ట్రర్ నందు నమోదు చేయాలి.
2) అరెస్టు చేస్తున్న అధికారి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నపుడు విధిగా అరెస్టు మెమో (Arrest memo)తయారు చేసి దాని మీద సంతకాలు తీసుకోవాలి. ఈ సంతకం చేసిన వ్యక్తి అరైస్టైన వ్యక్తి కుటుంబానికి చెందిన లేదా ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన వ్యక్తి అయివుండాలి.
3) అరెస్టు అయిన వ్యక్తి గురించి తన బంధువులకు, స్నేహితులు లేదా తన యోగక్షేమాలు చూసే వ్యక్తికి తెలియపరచాలి.
4) అరెస్టు అయిన వ్యక్తి బంధువులు, స్నేహితులు వేరే జిల్లా, రాష్ట్రం ఉన్నట్లయితే లీగల్ ఎయిడ్ సంస్థ ద్వారా ఆ వ్యక్తులకు సమాచారం అందే విధంగా సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
5) అరెస్టుగాని, నిర్బంధించడం గానీ చేసిన వెంటనే ఆ విషయాన్ని తమ బంధువులకు, స్నేహితులకు తెలియజేసుకునే హక్కు పోలీసులు అరెస్టు అయిన వ్యక్తికి కల్పించాలి.
6) అరెస్టు సమాచారాన్ని ఎవరికి తెలియజేశారో ఆ వివరాలు ఏ పోలీసు స్టేషన్‌కి, ఏ అధికారికి తెలియజేశారో ఆ వివరాలు ఆ వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారో అక్కడ ఉన్న డైరీలో నమోదు చేయాలి.
7) అరెస్టు అయిన వ్యక్తికి తప్పకుండా శారీరక పరీక్షలు చెయించాలి. అతని శరీరం మీద ఉన్న గాయాలను నమోదు చేయాలి. మెమో తయారు చేసి సంతకాలు చూపించాలి. ఒక కాపీని అరెస్టు అయిన వ్యక్తికి ఇవ్వాలి.
8) డిటెన్షన్‌లోకి 48 గం.లోపు వైద్యపరీక్షలు పొందాలి.
9) మేజిస్ట్రేట్‌కి సమాచారం ఇవ్వాలి అన్ని మెమోలు అన్ని డాక్యుమెంట్లను మీద సమాచార నిమిత్తం మేజిస్ట్రేట్ పంపాలి.
10) న్యాయవాది సమక్షంలో ఇంటరాగేషన్ చేయాలని అరెస్టు అయిన వ్యక్తి కోరితే తప్పకుండా అమలుచేయాలి.
11) ప్రతి జిల్లాలోని, ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసు కంట్రోల్ రూములకు అరెస్టు అయిన వివరాలు నిర్బంధించిన స్థలాన్ని/ప్రదేశాన్ని స్పష్టంగా నోటీసులు బోర్టులో ఉంచాలి.

పై మార్గదర్శకాలు ప్రతి పోలీసు అధికారి పాటించి తీరాలి. పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సంబంధిత హైకోర్టు (Hi court)ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మానవ హక్కుల పరిధి:
బానిస సమాజంలో మానవ హక్కుల సమస్య కేవలం జీవించే హక్కుకు సంబందించిన విషయం. ఈ బానిస సంకెళ్లు తెగితే చాలు అని బానిసలు భావిస్తున్నారు. భౌతిక దాడులు చిత్రహింసలు గొడ్డు చాకిరి వంశపారంపర్యంగా బానిసత్వం బానిసత్వంపై పోరాటాలు తిరుగుబాట్లు, ప్రతిఘటనలు భూస్వామ్య వ్యవస్థలో వ్యవసాయ కూలీలు పోరాటాలు మానవహక్కుల ఉల్లంఘన కింద వస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, సహజంగా వచ్చిన హక్కులకు భంగం వాటిల్లే విధంగా చేయడాన్ని మానవహక్కులు ఉల్లంఘనగా పరిగణించవచ్చు.

పెట్టుబడిదారీ విధానం వచ్చేసరికి పూర్తిగా మారిపోతుంది. జీవించే హక్కు కాకుండా అనేక హక్కులు మానవహక్కుల పరిధిలోకి వస్తాయి.
A) సమానత్వపు హక్కు.
B) సమాన అవకాశాల హక్కు.
C) దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు.
D) విద్యహక్కు ఉద్యోగాల్లో సమానహక్కు మొదలైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. కులం, మతం, లింగం, ప్రాంతం, ప్రాతిపదికన వివక్షత చూపరాదు. అల్పసంఖ్యాక, మైనార్టీ తెగలు, జాతులకు చెందిన సాంస్కృతి సాంప్రదాయాలు భాష పరమైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. బాలలు, మహిళలు, వికలాంగులు హక్కులు కూడా మానవహక్కుల కిందకు వస్తాయి.
ఆర్థిక దోపిడీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన పరిగణిస్తారు:
మనదేశంలో పార్లమెంటు (Parlament)చేత ఆమోదించిన హక్కులు మానవ హక్కులుగా పరిగణిస్తాం. జీవించే హక్కు, సమనత్వపు హక్కు, స్వేచ్ఛ మొదలైనవి.

మానవ హక్కుల వర్గీకరణ:
1) స్వేచ్ఛగా జీవించేహక్కు
2) భావప్రకటన హక్కు.
3) విద్యహక్కు.
4) తనకు ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకొనే హక్కు.
5) ఆరోగ్యవంతమైన ఆహార తీసుకొనేక్కు.
6) స్వచ్ఛమైన గాలి, నీరు పొందే హక్కు పర్యావరణ హక్కు.
7) వయోవృద్ధులు హక్కులు.
8) మహిళ హక్కులు.
9) బాలల హక్కులు.
10) ఖైదీల హక్కులు.
11) శరణార్ధుల హక్కులు.
12) శారీరక, మసికవైకల్యం గల వ్యక్తుల హక్కులు.
13) పౌరసత్వం లేని వ్యక్తుల హక్కులు.
14) రాజకీయ పరమైన హక్కులు.
15) అల్పసంఖ్యాక తెగల, జాతుల, భాష మతల హక్కులు.
16) సామాజిక పరమైన హక్కులు.
17) సాంస్కృతిక పరమైన హక్కులు.
18) వివక్షత నుంచి రక్షణ పొందే హక్కు.
19) వివిధ రకాలైన దోపిడీ అణచివేత నుంచి రక్షణ పొందే హక్కులు.
20) మేదోసంపత్తి హక్కులు.
21) ట్రేడ్ మార్క కాపీరైట్స్ హక్కులు.
22) స్వేచ్ఛగా సంచరించే హక్కులు ఈ మధ్యకాలంలో స్వలింగ సంపర్కం స్వేచ్ఛయుత శ్రుoగారం, వైవహికబంధం లేకుండా సహా జీవనం చేయుట, లైంగిక స్వేచ్ఛ తదితర హక్కులు కూడా మానవ హక్కుల కింద వస్తాయని సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే కేంద్రరాష్ట్ర కమిషన్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీ హక్కులు భంగం వాటిల్లితే మొదట మీ సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలి. వారు పాటించుకోకపోతే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు (Superintendent of Police)దరఖాస్తు చేసుకోవాలి. వారి ద్వారా న్యాయం జరగకపోతే కేంద్ర రాష్ట్రాల మానవ హక్కుల కమీషనర్లకు (Union States Human Rights Commissioners)లేఖ రాస్తూ మీరు పోలీసువారికి ఇచ్చుకున్న అర్జీలు జతపరచి పోస్టు ద్వారా గాని లేక స్వయంగా గానీ ఫిర్యాదు చేసుకోవచ్చు. కమిటీ వేసి లేదా స్వయంగా లేదా సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ద్వారా రిపోర్టులు తెప్పించుకుని, పరిశీలించి మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపితమైతే వారిమీద కేసు నమోదు చేసి జరిమానా విధిస్తుంది.

  • తెలంగాణ స్టేట్ డైరెక్టర్ కొంకట శ్రీనివాస్ : 73969 77665
  • నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్.
  • సౌత్ ఇండియా చైర్మన్ నజుముద్దీన్.
  • తెలంగాణ స్టేట్ చైర్మన్ ఉల్లెంగుల నాగరాజు.
  • కంజుమర్ ప్రొటెక్షన్ స్టేట్ చైర్మన్ సురేష్.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -