end
=
Sunday, November 24, 2024
వార్తలుజాతీయంపబ్లిక్ ప్లేసులో మాస్క్ తప్పనిసరి
- Advertisment -

పబ్లిక్ ప్లేసులో మాస్క్ తప్పనిసరి

- Advertisment -
- Advertisment -

  • వీలైనంత త్వరగా బూస్టర్ డోసు తీసుకోవాలి
  • ఏసీ రూముల్లో మాస్కులు తప్పనిసరి
  • ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం
  • ఆందోళన అవసరంలేదన్న సీఎం కేజ్రివాల్

Indian Medical Association: చైనాలో కరోనా కేసుల ఆందోళన నడుమ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (Indian Medical Association) (ఐఎంఏ) కీలక సూచనలు చేసింది. వీలైనంత త్వరగా బూస్టర్ షాట్ (Booster shot)తీసుకోవాలని ప్రజలను కోరింది. కరోనా ప్రవర్తన నియామవళిని ప్రతి ఒక్క పౌరుడు పాటించాలని కోరింది. ఈ మేరకు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకుగానూ పబ్లిక్ అడ్వైజరీ (Public Advisory)ని జారీ చేసింది. కొత్త వేరియంట్ బీఎఫ్.7 పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. పబ్లిక్ స్థలాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ (Mask)లు ధరించాలని సూచించింది. సామాజిక దూరం పాటించడం, తరుచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అంతేకాకుండా ప్రజలు గుమిగూడే పెళ్లిళ్లు, రాజకీయ, సామాజిక సమావేశాలను (Weddings, political and social gatherings)దూరం పెట్టాలని కోరింది. వీలైనంత మేరకు అనవసర ప్రయాణాలు తగ్గించాలని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించింది. వీలైనంత త్వరగా బూస్టర్ డోసు తీసుకోవాలని, సమయానుకూలంగా ప్రభుత్వ సలహాలను పాటించాలని పేర్కొంది. 2021లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సన్నద్ధతను పెంచాలని ఐఎంఏ (IMA)కోరింది.

కరోనా కొత్త వేరియంట్ ఆందోళన నడుమ కర్ణాటక (karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఇండోర్ (Indore), ఏసీ (AC)గదుల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicran) కొత్త వేరియంట్ ఆందోళనల నడుమ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా జ్వరం సంబంధిత లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షించుకోవాలని తెలిపింది. సీఎం బసవరాజ్ (CM Basavaraj)నేతృత్వంలో అధికారులతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యమంత్రి సుధాకర్ (Health Minister Sudhakar) తెలిపారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు తెరవడంతో పాటు ఆక్సిజన్ (oxygen)సదుపాయం ఉన్న బెడ్లు (Beds) అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అలాగే కరోనా ఆందోళనల నడుమ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Delhi CM Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశరాజధానిలో కొత్త వేరియంట్ కేసులు లేవని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. గురువారం కేజ్రివాల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఒకవేళ వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకలు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్, అంబులెన్స్(Beds, medical facilities, oxygen, ambulance in hospitals)లు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు. మరోవైపు సమూహంలో లేదా బయట తిరిగితే ప్రజలు మాస్క్ ధరించేలా ప్రోత్సహించాలని యూపీ ప్రభుత్వం (Uttarpradesh)ఆదేశాలిచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) కూడా రాష్ట్ర ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -