end
=
Sunday, November 24, 2024
వార్తలుజాతీయంDemonetisation:‘నోట్ల రద్దు’ తప్పుడు నిర్ణయమే
- Advertisment -

Demonetisation:‘నోట్ల రద్దు’ తప్పుడు నిర్ణయమే

- Advertisment -
- Advertisment -
  • చట్ట ప్రకారం జరగలేదన్న ఏకైక న్యాయమూర్తి
  • సుప్రీంకోర్టు తీర్పుపై జస్టిస్ బీవీ నాగరత్న

SC judge who opposed demonetisation: రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు నోట్ల రద్దు (note ban) నిర్ణయాన్ని సమర్దించారు. ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు. నోట్ల రద్దు నిర్ణయం, అమలు.. రెండూ చట్ట ప్రకారం జరగలేదని తేల్చి చెప్పారు. ఆ న్యాయమూర్తే జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagarathna). 4-1 మెజారిటీతో నోట్ల రద్దు(demonetisation) నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. సహచర న్యాయమూర్తులు సమర్దించినప్పటికీ.. నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న. నోట్ల రద్దు అమలు చట్ట ప్రకారం జరగలేదని ఆమె విస్పష్టంగా తన తీర్పులో ప్రకటించారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ 124 పేజీల తీర్పును జస్టిస్ బీవీ నాగరత్న(Justice BV Nagarathna) వెలువరించారు. అందులో కొన్ని కీలక అంశాలను ఆమె స్పృశించారు. నోట్ల రద్దు నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ, ఆ నిర్ణయాన్ని అమలు చేసిన తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఆమె (Justice BV Nagarathna) స్పష్టం చేశారు. ‘‘నల్లధనం నుంచి సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకునే సదుద్దేశంతోనే నోట్ల రద్దు(demonetisation) నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ, ఆ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేసిన తీరు చట్టవిరుద్ధంగా ఉంది’’ అని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) తేల్చి చెప్పారు.

నోట్ల రద్దు నిర్ణయంలో పార్లమెంటుకు కూడా భాగస్వామ్యం కల్పించి ఉండే బావుండేదని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) అభిప్రాయపడ్డారు. ‘‘పార్లమెంట్లో లోతైన, అర్థవంతమైన చర్చ అనంతరమే ప్రభుత్వం చట్టాలు చేయాలి. అలాగే, సున్నితమైన, కీలకమైన నోట్ల రద్దు వంటి నిర్ణయాన్ని కూడా పార్లమెంట్లో చర్చ జరిపి తీసుకోవాలి. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సామాన్యమైన నిర్ణయం కాదు. చెలామణిలో ఉన్న కరెన్సీలో 86% కరెన్సీని రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయం. అలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని కేవలం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా తీసుకోవడం సరికాదు. పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి, లోతైన, అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకుని ఉంటే ఆ నిర్ణయానికి చట్టబద్ధత లభించేది’’ అని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని తీసుకునే అధికారం కేంద్రానికి ఉండొచ్చు, కానీ ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి మూల స్థంభమైన పార్లమెంటును కూడా భాగం చేసి ఉంటే బావుండేది’ అన్నారు.

ఆర్బీఐ చట్టంలోని 26(2) సెక్షన్ లో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 8న ఒక ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా నోట్ల రద్దు (demonetisation) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ చట్టం(RBI Act)లోని సెక్షన్ 26(2) ప్రకారం ఈ నోటిఫికేషన్ ను కేంద్రం జారీ చేసింది. అయితే, ఈ సెక్షన్ ప్రకారం కూడా కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ చట్టం(RBI Act)లోని సెక్షన్ 26(2) (Section 26(2)) ప్రకారం.. ఏదైనా కరెన్సీలో ఒక సిరీస్ కానీ, కొన్ని సిరీస్ లవి కానీ నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RB) కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తుంది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన మీదట, కేంద్రం ఆ సిఫారసును అనుమతిస్తూ, నోటిఫికేషన్ ను జారీ చేస్తుంది. అంతేకానీ, గంపగుత్తగా, మొత్తం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలని (demonetisation) నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధం’’ అని జస్టిస్ నాగరత్న వివరించారు.

నల్లధనం (Black money), నకిలీ కరెన్సీ(Fake currency), పన్ను ఎగవేతలు, ఉగ్రవాద మూకలకు నిధులు చేరకుండా నియంత్రించడమే లక్ష్యంగా నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని ప్రకటించింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే చలామణిలోని రూ.10 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) నాడు తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్ట్ (supreme court) సమర్థించిన నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్ట్‌లో జరిగిన కీలక వాదనలు ఇలా ఉన్నాయి.

  • కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌దార్లు అభ్యర్థించారు.
  • ప్రత్యక్షంగా ఏలాంటి ఉపశమనమివ్వని అంశంలో సుప్రీంకోర్ట్ నిర్ణయం సబబుకాబోదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఇలా చేయడమంటే.. గడియారాన్ని వెనక్కి తిప్పడం, పగిలిన గుడ్డును అతికించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది.
  • శీతాకాలం విరామానికి ముందు డిసెంబర్ 7న సుప్రీంకోర్ట్ ఐదుగురు సభ్యుల బెంచ్ వాదనలు విన్నది. ఈ బెంచ్‌కు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వం వహించారు. అయితే తీర్పును వాయిదా వేసి తాజాగా సోమవారం ప్రకటించారు.
  • తగిన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సమర్థించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీ, పన్ను ఎగవేతలు, ఉగ్రవాద గ్రూపులకు నిధులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
  • అయితే నకిలీ కరెన్సీ లేదా బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యమ్నాయ పద్ధతులను చూపలేదని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ అడ్వకేట్ పి.చిదంబరం వాదించారు.
    *పెద్ద నోట్ల రద్దుపై చట్టబద్ధ ప్రక్రియను ప్రారంభించలేదని చిదంబరం ప్రస్తావించారు. ఒక్క ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సును మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తప్పుబట్టారు.
    *నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. నవంబర్ 7న ఆర్బీఐకి రాసిన లేఖను కూడా చూపించలేదని, ఆర్బీఐ సమావేశం మినిట్స్‌ను కూడా వెల్లడించలేదని చిదంబరం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
    *ఇక ఆర్థిక విధాన నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రాబోవని ఆర్బీఐ న్యాయవాది వాదించారు. అయితే ఆర్థిక విధాన నిర్ణయమనే కారణంతో చేతులు కట్టుకుని కూర్చోబోదని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. పిటిషన్లను పరిగణలోకి తీసుకుని పరిశీలించింది.
    *జనాలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆర్బీఐ… దేశ నిర్మాణంలో ఇలాంటి పరిస్థితులు సహజమేనని సమర్థించుకుంది. ఈ తర్వాత సమస్యలను పరిష్కరించినట్టు సుప్రీంకోర్టుకు వివరించింది.
  • పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నో వ్యాపారాలు నాశనమవ్వడంతోపాటు ఎంతోమంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు చేసిన ఆరేళ్ల తర్వాత 2016 నాటి కంటే 72 శాతం కరెన్సీ ఎక్కువగా చలామణీలో ఉందని విమర్శించారు.

(CM Jagan:రూట్ మార్చిన సీఎం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -