- బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఫుట్‌పాత్‌పై లభ్యం
మహిళను హత్య చేసి పడేశారా? మరేకారణమో తెలియదు గానీ 60 ఏండ్ల ఓ మహిళ శవాన్ని గోనె సంచెలో కట్టేసి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ 2లో ఫుట్‌పాత్‌పై పడేశారు. ఇది గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని ఆ గోనె సంచిని విప్పారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు? ఆ శవం ఇక్కడ పడేసి వెళ్లారు? అని విచారణ చేపట్టారు. శవాన్ని పోస్టుమార్ట నిమిత్తం తరలించారు. శవ పంచనామా అనంతరం అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.