end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంKishan Reddy:కేటీఆర్ కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి
- Advertisment -

Kishan Reddy:కేటీఆర్ కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి

- Advertisment -
- Advertisment -
  • కేంద్ర నిధులపై చర్చలకు రెడీగా ఉన్నట్లు వెల్లడి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ (KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదన్నారు. కేటీఆర్.. కేసీఆర్‌ (KCR) కంటే దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని చెప్పారు. కేటీఆర్ కాదు.. రాజీనామా లేఖతో కేసీఆర్ సిద్ధంగా ఉంటే.. కేంద్ర నిధులపై చర్చకు రెడీ అన్నారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని విమర్శించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.

అలాగే వందే భారత్ రైలు (Vande bharath train)తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకని చెప్పిన కిషన్‌రెడ్డి.. ఆదివారం ఈ రైలును ప్రధాని (pm modi)వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. దీనికోసం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపిందని, కార్యక్రమానికి హాజరవడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జనవరి 20న అపాయింట్ మెంట్ లెటర్లు (appointment letter)ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రేపు ఉదయం 9గంటలకు వందే భారత్ రైలు ప్రారంభిస్తామన్నారు. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రతినెలా లక్ష వరకు ఉద్యోగాలు భర్త చేస్తున్నామన్నారు. 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యమన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశ వ్యాప్తంగా లక్షా50వేల వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వెల్నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

గతంలో దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు (medical college) ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ (AIIMS)ఆస్పత్రులుండగా, ఆ సంఖ్య 22కు పెరిగిందని చెప్పారు. 2024లో మరో 9 ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. మరోవైపు, ప్రధాని మోడీ ఆదివారం వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురికి ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన సవాలును కిషన్ రెడ్డి స్వీకరించారు. కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకుని కేటీఆర్ వస్తే చర్చించడానికి సిద్ధమని తేల్చిచెప్పారు. కాగా ఆయన సవాలుపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తాడోనని ప్రజలు ఆసక్తికిగా ఎదురుచూస్తున్నారు.

(Mahbubabad District:కమ్మమం సభా చారిత్రతామక సభ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -