end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంTelangana:రిపబ్లిక్ వేడుకలు మళ్లీ రాజ్‌భవన్‌లోనే?
- Advertisment -

Telangana:రిపబ్లిక్ వేడుకలు మళ్లీ రాజ్‌భవన్‌లోనే?

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan, Pragati Bhavan)మధ్య ఏడాదిన్నర క్రితం వివాదం మొదలైంది. దీంతో గత ఏడాది (2022–23) బడ్జెట్ సమావేశాలు గవర్నర్ (governor) స్పీచ్ లేకుండానే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇరువురు మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఫిబ్రవరి 3వ వారంలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ ప్రసంగం అవసరం లేదనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ (KCR)ఉన్నట్టు తెలిసింది. అలాగే తెలంగాణ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ (BUDGET)సమావేశాలను కూడా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ (Assembly prorogue)ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని సర్కారు భావిస్తునట్టు తెలిసింది. అసెంబ్లీని ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం అవరసం లేదనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య మొదలైన వివాదం వల్ల ఏడాదిన్నరగా ప్రభుత్వం అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలంటే గవర్నర్ అమోదం తప్పనిసరి. ఒకవేళ ప్రోరోగ్ చేస్తే, తిరిగి అసెంబ్లీ సమావేశపరచాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకోసం మర్యాద పూర్వకంగా రాజ్ భవన్‌కు సీఎం కేసీఆర్ వెళ్లి అమె పర్మిషన్ (permission) తీసుకోవాలి. అసలు రాజ్ భవన్‌కు వెళ్లకుండానే, అమె అనుమతి లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు కేసీఆర్ మొగ్గుచూపారు. అందులో భాగంగా 2021 సెప్టెంబరు (September)27న మొదలైన అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేయలేదు. వాటిని రెండో అసెంబ్లీ 8వ సెషన్‌గా నోటిఫై చేశారు. అప్పటి నుంచి నిర్వహించిన ప్రతి అసెంబ్లీ సమావేశాలను అందులో భాగంగానే నిర్వహిస్తున్నారు.

2021 సెప్టెంబరులో ప్రారంభమైన రెండో అసెంబ్లీ 8వ సెషన్స్ (session)సమావేశాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. 2022 మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలను రెండో సిట్టింగ్‌గా, 2022 సెప్టెంబరు 13న నిర్వహించిన సమావేశాలను మూడో సిట్టింగ్‌గా పేర్కొంటూ నోటిఫికేషన్ (notification)ఇచ్చారు. 2023–24 బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి (February)మూడోవారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. వాటిని నాలుగో సిట్టింగ్‌గా పేర్కొంటూ ఎమ్మెల్యేలకు (MLA)సమాచారం ఇచ్చే చాన్స్ ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ (IAS)అధికారి వివరించారు.

బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం చాలా కాలంగా అనవాయితీగా వస్తున్నది. కానీ కేసీఆర్ ఆ పద్దతిని పక్కన పెట్టేశారనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. రాజ్యంగం ప్రకారం అసెంబ్లీని ఉద్దేశించి ప్రతి ఏడాది గవర్నర్ ప్రసంగించాల్సి లేదు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తప్పనిసరిగా చేయాలి. అలాగే ప్రతి కాలెండర్ ఇయర్‌లో తొలి సెషన్‌ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండాలి. అయితే అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తేనే కొత్త సెషన్‌కు అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏడాదిన్నరగా అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా 8వ సెషన్ పేరుతో సమావేశాలను నిర్వహిస్తోంది.

గణతంత్ర వేడుకలను (Rupublicday) కూడా రాజ్ భవన్‌కే పరిమితం చేయాలని ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలిసింది. కోవిడ్ (COVID) పరిస్థితులు రాకముందు రిపబ్లిక్ వేడుకలను పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించేవారు. గత ఏడాది కోవిడ్ నిబంధనల పేరుతో వేడుకలను రాజ్ భవన్‌కే పరిమితం చేశారు. ఆ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులను ఆహ్వానించినా ఎవరూ వెళ్లలేదు. అయితే ఈసారి వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంతవరకు ప్రోటోకాల్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిసింది. అయితే ప్రస్తుతం రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే చాన్స్ లేదని రాజ్‌భవన్‌కే పరమితం చేస్తారనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది.

(Khammam: 2024 తర్వాత బీజేపీ ఇంటికే)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -