end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంవేగంగా వెళ్ళొద్దనందుకే చితకబాదరు..
- Advertisment -

వేగంగా వెళ్ళొద్దనందుకే చితకబాదరు..

- Advertisment -
- Advertisment -

ట్యాంక్‌ బండ్‌పై సోమవారం తెల్లవారు జామున చిన్నపాటి గొడవ చిలికిచిలిక గాలివానలా మారింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు అతి వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు గొడవకు దారి తీసింది. గాంధీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట జెమిస్తాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అరుణ్‌, సాయికుమార్‌, సంతోష్‌, మల్లికార్జున్‌ స్నేహితులు. వీరు గణేశ్‌ విగ్రహన్ని నిమజ్జనం చేయాడానికి ఆదివారం రాత్రి టాటా సఫారి వాహనంపై గణేశ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పైకి తీసుకొచ్చారు. 3.30 గటల సమయంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి అదే కారులో ఇంటికి తిరిగి వెళ్తున్నారు.

ఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఈ క్రమంలో వారి పక్క నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌ వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించారు. దీంతో అగ్రహానికి గురైన ముగ్గురు యువకులు కారులో ప్రయాణిస్తున్న వారిపై గొడవకు దిగారు. ఇదే సందర్భంలో ద్విచక్ర వాహనదారులకు సంబంధించిన మరి కొంతమంది వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్న వారిపై గొడవకి దిగి చితకబాదరు. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మాజీ రాష్ర్టపతికి తెలుగు రాష్ర్టల సీఎంల సంతాపం..

గొడవ క్రమంలోనే కారులో నుంచి మంటలు వచ్చి కారుతో పాటు పక్కనే ఉన్న బస్టాప్‌ కూడా తగలబడింది. ఇది ఆ ముగ్గురు యువకులే తగలబెట్టి ఉంటారా అని తెలియాల్సి ఉంది. కారులో ప్రయాణిస్తున్న బాధితులు పోలీసులక సమాచారం అందించడంతో ఘటన స్థాలానికి చిక్కడిపల్లి ఏసీపి శ్రీధర్‌ గాంధీనగర్‌ పోలీసులతో చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -