భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra modi)మరోసారి తెలంగాణకు (telangana) రాబోతున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు తెలుస్తుండగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ (hyderabad)కు వస్తారని, ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసగింస్తారని సమాచారం. టూర్ లో భాగంగా ఐఐటీ (IIT) హైదరాబాద్ లోని క్యాంపస్ లోని నూతన భవనాన్ని కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. వీటితో పాటు పలు జాతీయ రహదారులతో పాటు కొత్త రైల్వే లైన్ల పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని సమాచారం.దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఈనెల 19నే ప్రధాని హైదరాబాద్ రావాల్సిఉంది. ఆ సమయంలో వందేభారత్ (Vande Bharat) ను ప్రారంభించి మిగతా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ షెడ్యూల్ లో మార్పుల కారణంగా అప్పటి పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలో వచ్చే నెల 13న ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
నిజానికి తెలంగాణపై బీజేపీ (BJP) నాయకత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. జాతీయ కార్యవర్గాలతో పాటు ఇటీవల మూడు రోజులు పాటు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహించారు. దీనికి బీఎల్ సంతోష్ (BL Santhosh) తో పాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టలాన్న కసితో పార్టీ నాయకత్వం కూడా పని చేస్తోంది. ఎన్నికల ఏడాది వేళ ప్రధాని మోదీ తెలంగాణకు రావటంతో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు.ఈ క్రమంలో పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బీఆర్ఎస్ (BRS) సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మరోసారి బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తారా..? ఎన్నికల ఏడాది వేళ కీలక ప్రకటనలు ఉంటాయా? అనేది చర్యనీయాంశమైంది.
మరోవైపు త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు వస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలంగాణలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. కేంద్రమంత్రి బి.ఎల్ వర్మ శనివారం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మెదక్ పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పర్యటన ఉంది. ఈ నెల 23, 24 తేదీల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటిస్తారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.
(Parlament :నూతన పార్లమెంటు భవన చిత్రాలు)
ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ని పోటీ చేయించాలని కమలదళం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాల్సి వస్తే.. మహబూబ్ నగర్ (Mahbubnagar) లోక్‌సభ స్థానాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తమకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనాకు వచ్చారట. ఇప్పటికే ఓసారి మహూబూబ్ నగర్‌పై హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సీక్రెట్‌గా సర్వే చేయించారట. మహబూబ్ నగర్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తే.. ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మొదటి విడత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో రెండో రెండో విడత సర్వే కూడా చేయనున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీకి బాగానే పట్టుంది. నేతలే కాదు.. కేడర్ కూడా ఎక్కువగానే ఉంది. వాజ్‌పేయీ హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీదే మహబూబ్ నగర్ నుంచి గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. జనతా పార్టీ ఉన్న సమయంలో జైపాల్ రెడ్డి (Jaipal Reddy) కూడా రెండు సార్లు మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాకు చెందిన బలమైన నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. డీకే అరుణ (DK Aruna) బీజేపీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) నుంచి గెలిచిన జితేందర్ రెడ్డి (Jitender Reddy).. ఇప్పుడు కాషాయ దళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్‌లో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అక్కడి నుంచి ప్రధాని మోదీని ఎన్నికల బరిలోకి దింపితే ఆ ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.