end
=
Friday, November 22, 2024
ఉద్యోగ సమాచారంLIC:భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ‘ఎల్‌ఐసి’
- Advertisment -

LIC:భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ‘ఎల్‌ఐసి’

- Advertisment -
- Advertisment -
  • 9394 ఏడీఓ ఉద్యోగాల భర్తికీ గ్రీన్ సిగ్నల్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (Apprentice Development Officer on regular basis in LIC offices) (ADO) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ (Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు (Graduate Candidates, LIC Employees, Agents) ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.


మొత్తం పోస్టులు: 9394
జోన్ల వారీగా ఖాళీలు:
సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్) : 561
ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా) : 1049
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పాట్నా): 669
నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ): 1216
నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) : 1033
సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై): 1516
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408
వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1942
దక్షిణ మధ్య జోన్‌లో డివిజన్ల వారీగా ఖాళీలు
కడప -90
హైదరాబాద్ -91
కరీంనగర్ – 42
మచిలీపట్నం -112
నెల్లూరు – 95
రాజమహేంద్రవరం – 69
సికింద్రాబాద్ – 94
విశాఖపట్నం – 57
వరంగల్ – 62
బెంగళూరు 1 – 115
బెంగళూరు 2- 117
బెల్గాం – 66
ధార్వాడ్ – 72
మైసూర్ – 108
రాయచూర్ – 83
షియోగా – 51
ఉడిపి – 84

(LIC:యాబైవేల జీతంతో LICలో ఉద్యోగాలు)

అర్హత:
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (Bachelor’s degree) లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ (Insurance Institute of India Fellowship in Mumbai) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.

వయసు:
జనవరి 1, 2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
(నిబంధనలు వర్తిస్థాయి)

వేతనం:
నెలకు అప్రెంటిస్ సమయంలో రూ. 51,500 స్టైపెండ్ ఉంటుంది. ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (Probationary Development Officer) గా నెలకు రూ. 35,650 నుంచి 90,205 వేతనం ఉంటుంది.

ఎంపిక:
ఆన్‌లైన్ పరీక్షలు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామ్ (Online Exams Prelims, Mains and Interview, Pre Recruitment Medical Exam) ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం:
ప్రలిమినరీ పరీక్ష:
రీజనింగ్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల (Reasoning Ability, Numerical Ability, English Language Subjects) నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట ఉంటుంది.

మెయిన్స్ పరీక్ష:
మెయిన్స్‌లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర‌నెస్ సబ్జెక్టు (Ability and Numerical Ability, GK, Current Affairs, English Language, Insurance and Financial Marketing Awareness .. Subject) ల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. సమయం 2 గంటలు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది:
ఫిబ్రవరి 2, 2023

ప్రిలిమినరీ పరీక్ష:
మార్చి 12, 2023.

పరీక్ష తేది:
ఏప్రిల్ 8, 2023.

వెబ్‌సైట్: https://licindia.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -