బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ (‘India: The Modi Question’) డాక్యుమెంటరీ (Documentary)పై వివాదం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇప్పటికే దీనిని ప్రదర్శితం చేయొద్దని కేంద్రం ఆదేశాల నడుమ కేరళలో (Kerala) కొన్ని రాజకీయ వర్గాలు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తాము వివాదస్పద డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించాయి. దీనిని బీజేపీ (BJP) నేతలు ఖండించారు.
అయితే కేరళ సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinery Vijayan) ఈ విషయంలో జోక్యం చేసుకుని అలాంటి చర్యలను ఆపాలని కోరారు. అంతకుముందు సీపీఎం యూత్ వింగ్ డీవైఎఫ్ఐ (CPM Youth Wing DYFI) సామాజిక మాధ్యమం వేదికగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించాయి. ఎస్ఎఫ్ఐ, కేరళ యూత్ కాంగ్రెస్ వింగ్ (SFI, Kerala Youth Congress Wing) కూడా ఇదే ప్రకటన చేశాయి. గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున అన్ని జిల్లా ప్రధానకార్యాలయాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని కేరళ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ పేర్కొంది. అయితే దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ (BJP state president Surendran) ఖండించారు. ఇది రాజద్రోహమని అని విమర్శించారు.
(Tirupati:తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త)
అలాగే ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వొద్దని సీఎంను కోరారు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన దురదృష్టకర సంఘటనలను తవ్వడం మత ఉద్రిక్తతలకు నిప్పు రాజేయడమేనని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్రం యూట్యూబ్, ట్విట్టర్ డాక్యుమెంటరీ (YouTube, Twitter Documentary)కి సంబంధించిన లింకులను బ్లాక్ (Block links) చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా బీబీసీ డాక్యుమెంటరీ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది. మరోవైపు 302 మంది జడ్జిలు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ఉన్నతాధికారులు (Judges, ex-bureaucrats, ex-high officials) ఈ డాక్యుమెంటరీని ఖండించారు. దేశ భక్తుడిపై ఉద్దేశపూర్వకంగా చేసిన చార్జిషీటు (Charge sheet) అని ఆరోపించారు.