Indus : సింధూనది టిబెట్‌లోని కైలాస్ (Kailash in Tibet) వరుసలో మానససరోవరం (Manasasarovaram) వద్ద పుట్టింది.
- అక్కడి నుండి పశ్చిమానికి ప్రవహించి, జమ్మూ-కాశ్మీర్‌ని దాటి..పాకిస్థాన్‌లో ప్రయాణించి తర్వాత అరేబియా సముద్రంలో కరాచీ వద్ద కలుస్తుంది.
- ఈ నది మొత్తం పొడవు – 2880 km.
ఇందులో మన దేశంలో జమ్మూ కాశ్మీర్ లో 709km ప్రయాణిస్తుంది. - ఈ సింధూనది జమ్మూ కాశ్మీర్ లో నంగ ప్రభాత్ పర్వతాన్ని తాకుతూ వెళ్తుంది.
- ఈ సింధూ నదికి కుడి వైపున ఉన్న ఉపనదులు వరుసగా
- జీలం
- చీనాబ్.
- రావి.
- బియాస్
- సట్లేజ్
- జీలం నది :
- ఇది జమ్మూ-కశ్మీర్ (Jammu and Kashmir) లో పిర్‌పంజాల్ (Pirpanjal) వరుసలో పుట్టి పశ్చిమానికి వెళ్ళి పాకిస్థాన్‌లో సింధూ (Indus in Pakistan) లో కలిసింది.
- చీనాబ్ నది : (River Chenab)
- ఇది హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో బారాలాచా లా కనుమల్లో పుట్టి పాకిస్థాన్
సింధూనదిలో కలిసింది.ఇది సింధు ఉపనదుల్లో కెల్లా పెద్ద ఉపనది
- రావి నది :
- ఇది కూడా హిమాచల్ ప్రదేశ్‌లో కులూ కనుమలులో పుట్టి పాకిస్థాన్‌లో లాహోర్ నగరం గుండా ప్రయాణించి, సింధూ నదిలో కలుస్తుంది.
- అందువల్ల రావి నదిని లాహోర్ నది అని కూడా అంటారు.
- బియాస్ నది :
- ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ లో కులూ కనుమ లో పుట్టి, ఇది పాకిస్థాన్ గుండా
వెళ్ళని సింధూ ఉపనది. - ఇది సట్లేజ్ నదిలో పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలో హరికే అనే ప్రాంతంలో కలుస్తుంది.
(PM Modi:ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు మోడీ!)
- సట్లెజ్ నది:
- ఇది మన దేశంలో పుట్టని సింధూ ఉపనది.
- టిబెట్‌లోని కైలాస్ శ్రేణిలో లోయ వద్ద పుట్టి మన దేశం గుండా వెళ్తూ, బియాస్ నదిని కలుపుకొని పాకిస్థాన్ లోకి వెళ్ళింది.
- సట్లెజ్ నది సింధూ ఉపనదుల్లో కెల్లా పొడవైన ఉపనది.
బ్రహ్మపుత్రా నదీ వ్యవస్థ:
- ఇది కూడా టిబెట్ కైలాస్ శ్రేణిలో మానస సరోవరానికి దగ్గర్లో ఉన్న
చమయంగ్ డాంగ్మ్ అనే ప్రాంతంలో పుట్టి తూర్పుకు ప్రవహించుకుంటూ వెళ్ళి,
మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రెండు రాష్ట్రాలు దాటి, బంగ్లాదేశ్ లోకి
ప్రవేసిస్తుంది. - ఈ నది మొత్తం పొడవు – 2900km.
- ఇందులో మన దేశంలో రెండు రాష్ట్రాల్లో 885 km ప్రయాణిస్తుంది.
ఈ నది బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే జమునా నదిగా పిలువబడుతుంది.
పద్మానదితో కలిసిన తర్వాత మేఘన నదిగా పిలువబడుతుంది..
బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లు:
- టిబెట్‌లో- యార్లాంగ్ త్సాంగ్పో (టిబెట్ భాషలో శుద్ధి చేసేవాడు అని అర్థం.
- అరుణాచల్‌ప్రదేశ్- దిహంగ్
- అసోం- సైడంగ్
- బంగ్లాదేశ్‌లో గంగానది (పద్మానది)తో కలిసిన తర్వాత (రెండింటినీ కలిపి)- మేఘన
- చైనా- యార్లాంగ్ జాంగ్బో జియాన్‌జిన్
- ఇండియా- రెడ్ రివర్
(Seedat:లక్ష రూపాయల జీతంతో ఇంజనీర్ పోస్టులు)
బ్రహ్మపుత్ర ఉపనదులు:
బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన కలిసే ఉపనదులు: తీస్తా, మానస, గంగాధర్, బేల్‌సిరి, ధరణ్‌సిరి, సుభనసిరి
దక్షిణవైపు నుంచి కలిసే ఉప నదులు: దిబ్రూ, డిక్కు, దిహంగ్
పర్వతీయ నది: రాగాత్సాంగ్‌పో
బ్రహ్మపుత్ర నదికి అసోం దుఃఖదాయని అనే పేరు ఉంది. (ఇది దిశను మార్చుకొని భయంకర వరదతో ప్రవహిస్తుంది)
బ్రహ్మపుత్ర నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైనది.
ఈ నది అసోంలో మాజోలి అనే ద్వీపాన్ని ఏర్పర్చింది. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం
ఈ నది పరీవాహక ప్రాంతంలోని జోర్హాట్ జిల్లాలో కజిరంగా నేషనల్ పార్క్ (1905 – 2005 వందేండ్లు పూర్తి) ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి.
బ్రహ్మపుత్ర నది S ఆకారంలో ప్రవహిస్తుంది.