India Post Jobs : కేవలం పదో తరగతి (SSC) అర్హతతో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో(India Post) ఉద్యోగం పొందవచ్చు. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dock Sevak) పోస్టుల కోసం భారతీయ తపాలా సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసైతే చాలు. దేశవ్యాప్తంగా 30,041 పోస్టల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో(AndhraPradesh) 1058, తెలంగాణలో(Telangana State) 961 గ్రామీణ డాక్ సేవక్‌లు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హతలు
పదో తరగతి(10th Class) పాసై ఉండాలి. అలాగే స్థానిక భాషతో పాటు ఇంగ్లిష్(English), గణితంపై(Maths) పట్టు ఉండాలి. ఏపీ, తెలంగాణలో తెలుగు సబ్జెక్టును పదో తరగతి వరకు చదివి ఉండాలి. దీంతోపాటుగా సైకిల్ తొక్కడం, కంప్యూటర్ పరిజ్ఞానం(Computer Knowledge) అవసరం.
వయస్సు
18 నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు(SC, ST) 5 సంవత్సరాలు, ఓబీసీలకు(OBC) 3 సంత్సరాలు, దివ్యాంగులకు(Physically Challegned) 10 ఏళ్ల వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం
బీసీఎం(BPM) పోస్టులకు నెలకు రూ. 12,000 నుండి రూ.29,380, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు గాను రూ.10,000 నుండి రూ.24,470 వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం
పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్/ఈమెయిల్ /పోస్టు ద్వారా సమాచారం అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023
దరఖాస్తు సవరణలకు అవకాశం: 24.08.2023 నుంచి 26.08.2023 వరకు
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/