Vanaparthi : ౩౦౦ కేజీల బరువున్న మొసలి (Crocodile) రైతు పొలంలో(Paddy Fields) కనిపించింది. ఒక్కసారిగా భయానికి గురైన రైతు స్థానిక జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని పట్టుకొని కృష్ణానదిలో(Krishna River) వదిలిపెట్టారు. ఈ ఆదివారం ఉదయం వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మండలం కంచిరావుపల్లి(Kanchiravupally)లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నరసింహ (Farmer Narsimha) అనే రైతు పొలానికి వెళ్లగా 14 అడుగుల పొడువు కలిగిన పెద్ద మొసలి కనబడింది. దీంతో భయానికి గురైన నరసింహ జిల్లాకేంద్రంలోని సాగర్ స్నేక్ సొసైటీకి(Sagar Snake society) సమాచారం ఇచ్చారు. సాగర్ బృందం మొసలిని తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం కృష్ణానదిలో వదిలిపెట్టారు. అయితే ఈ మొసలి బరువు 300 కేజీలు ఉందని సాగర్ బృందం తెలిపింది.