కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రయాణ సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్ ఇండియా 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ నుండి చెన్నైకు విమాన సర్వీసులు పున ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ రెండవ వారంలో విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇందుకు అనుగుణంగా విమానాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింంది.
సెప్టెంబర్ 7 నుండి హైదరాబాద్ మెట్రోరైళ్లు
కాగా, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఈనెల 8వ తేదీన చెన్నైకు తొలి విమానం మొదలుకానుంది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి 9 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరుకు నాలుగు, హైదరాబాద్‌కు నాలుగు, వారంలో రెండు రోజుల పాటు ఢిల్లీకి ఒక విమానం నడుస్తున్నాయి. తాజాగా చెన్నైకు ఒక విమానంతో పాటు హైదరాబాద్‌కు మరో విమానానికి అవకాశం ఇవ్వటంతో ఆ సంఖ్య 11కు చేరుకుంది. చెన్నై కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే వారం ఓ సర్వీసును ప్రయోగాత్మకంగా నడపాలని అధికారులు భావిస్తున్నారు.