end
=
Wednesday, April 16, 2025
సినీమా‘దండోరా’లో బోల్డ్‌గా బిందు మాధవి !
- Advertisment -

‘దండోరా’లో బోల్డ్‌గా బిందు మాధవి !

- Advertisment -
- Advertisment -

`ఓం శాంతి`, `అవ‌కాయ్ బిర్యానీ`, `ఇంకోసారి`, `సెగ‌` వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌(Telugu viewers)ను అల‌రించిన బిందు మాధవి(Actress Bindu madhavi) తాజాగా మ‌రో సినిమాతో అల‌రించ‌నున్న‌ది. ఆ చిత్రం దండోరా(Dandora movie). లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి (Love marriage) చేసుకున్నా, ఆ వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపొందుతోంది. శివాజీ, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నారు. భావోద్వేగంతో కూడిన ఆమె పాత్ర ఆలోచింపజేస్తుందని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో బిందుమాధవి పాల్గొంటున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -