end
=
Wednesday, April 16, 2025
వార్తలురాష్ట్రీయంటెట్ దరఖాస్తుల స్వీకరణ
- Advertisment -

టెట్ దరఖాస్తుల స్వీకరణ

- Advertisment -
- Advertisment -

టెట్ ఫీజును తగ్గించాలని అభ్యర్థుల డిమాండ్

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Tet)సంబంధించి మంగళవారం నుంచి దరఖాస్తుల(Applications) స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేడు టెట్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ జారీ చేయనున్న విద్యాశాఖ అనంతరం ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌(Help desks)లు ఈ నెల నుంచి జూలై 22 వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 9 వరకు హాల్‌టికెట్లు జారీ చేస్తారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే భారీగా ఉన్న టెట్ ఫీజును తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200, రెండు పేపర్లు రాస్తే రూ.300 ఫీజు ఉండేది. కానీ 2024 మార్చిలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో టెట్ ఫీజును ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు చేసింది. దీంతో అప్పట్లో అభ్యర్ధులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఫీజు చెల్లించిన వారికి మరొక టెట్‌కు సడలింపు ఇస్తామని ప్రకటించింది. 2024 మేలో టెట్ రాసిన వారందరికీ నవంబర్‌లో నిర్వహించిన టెట్‌కు ఉచితంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఫీజును కాస్త తగ్గించి మిగతావారికి మాత్రం ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి ఫీజు నిర్ధారించారు. తాజాగా జారీ చేసిన టెట్ కూడా అదే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న పాత ఫీజులనే కొనసాగించాలని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈసారి టెట్‌కు దాదాపు 2.70 లక్షల నుంచి 3 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశముంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -