వెరికోస్ వెయిన్స్ (varicose veins) సమస్యను కొన్ని సహజ సిద్ద (Natural remedies) ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నయం చేసుకోవచ్చు.సర్జరీ (Surgery) చేయించుకోవాల్సిన అవసరం కూడా రాకుండా ఉంటుంది. ఆ చిట్కా తయారీ విధానం తెలుసుకుందాం.
- ఒక గిన్నెలో 8 లేదా 10 ఎండు ద్రాక్షల(Dry Grapes)ను తీసుకోవాలి.తరువాత ఇందులో ఒక స్పూన్ చియా విత్తనాలను వేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ అవిసె గింజలను ఒక నిమిషం పాటు వేయించి పొడిగా చేసుకుని ఈ పొడిని కూడా వేసుకోవాలి. తరువాత ఇవి మునిగి పోయే వరకు నీటిని పోసి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలాగే ఈ నీటిని తీసుకున్న అర గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.ఈ నీటిని తాగి ఎండు ద్రాక్షను, చియా విత్తనాలను నమిలి మింగాలి. ఇలా పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు వెరికోస్ వెయిన్స్ సమస్య అలాగే ఈ సమస్య కారణంగా కలిగే నొప్పి కూడా తగ్గుతుంది.
- ఈ చిట్కాను పాటించడంతో పాటు ఇలా సిరలు ఉబ్బి ఉన్న చోట ఆలివ్ నూనెను రాసి రోజుకు రెండు సార్లు మర్దనా చేయడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
డాక్టర్ వెంకటేష్
ఆయుర్వేద వైద్యుడు
9392857411