end
=
Friday, April 18, 2025
సినీమాసీతాకోకచిలుక వ‌న్నెల వామికా.. నీ అందానికి జోహారిక‌
- Advertisment -

సీతాకోకచిలుక వ‌న్నెల వామికా.. నీ అందానికి జోహారిక‌

- Advertisment -
- Advertisment -

పంజాబీ బామ వామికా(Wamiqa Gabbi) గ‌బ్బి మంచిన‌టిగా జాతీయ స్థాయి(National Star)లో గుర్తింపు తెచ్చుకున్న‌ది. మ‌న టాలీవుడ్‌(Tollywood)లో కూడా సుధీర్‌బాబుతో క‌లిసి `భ‌లే మంచి రోజు` అనే క్రైం కామెడీ చిత్రంలో మెరిసింది. బాలీవుడ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. వామికా రాబోతున్న‌ చిత్రం ‘భూల్ చుక్ మాఫ్ ` త్వ‌ర‌లో ఈ చిత్రం విడుదల కానున్న‌ది. మూవీ రిలీజ్ ముందు ముంబైలో జరిగిన హై-ఫ్యాషన్ గాలాలో వామిక చేసిన‌ ర్యాంప్ వాక్(Ramp walk) అదిరిపోయింది. ‘ది వర్డ్’ మ్యాగజైన్ కాస్ట్యూమ్ గాలాలో వామికా గబ్బి రెడ్ కార్పెట్‌పై అందాల‌తో ఆక‌ట్టుకున్న‌ది. సీతాకోకచిలుక‌లు (Butterflies) త‌న దేహం వాలిన‌ట్లు డిజైన్ చేసిన డ్రెస్ లో త‌ళుక్కున మెరిసింది. స్ట్రాప్‌లెస్ కైలానీ బ్లాక్ గౌను ప్లంగింగ్ నెక్‌లైన్ తో ఎంతో ఆక‌ట్టుకుంది. మెలోన్ క్రేప్ క్రిస్టల్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన ఈ డ్రెస్ రిఫ్లెక్టివ్ షిమ్మర్ తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. డిజైన‌ర్ ఆ డ్రెస్‌ను సెమిప్రెషియస్ రాళ్లు, పూసలు, ఇత్తడి పదార్థంతో పొదిగిన‌ట్లు తెలిసింది. వామికా ఈ తాజా క్లిప్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఆమె హొయ‌ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -