end
=
Friday, April 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంమైగ్రేన్ స‌మ‌స్య ఉందా.. ఈ చిట్కాల‌ను పాటించండి...
- Advertisment -

మైగ్రేన్ స‌మ‌స్య ఉందా.. ఈ చిట్కాల‌ను పాటించండి…

- Advertisment -
- Advertisment -

మైగ్రేన్ సమస్య(Migraine Headache) ఉన్నవారు పెయిన్ కిల్లర్స్(Pain killers) ను వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీని కోసం మందులు వాడకుండా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు.

1. మైగ్రేన్ తో సతమతమయ్యే వాళ్ళు 7 నుండి 8 ఎండు ద్రాక్ష(Dry grapes), బాదం(Almond) రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపు(Empty gut) తో తినాలి. ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

2. ధనియాలని ఎండ పెట్టి దానిని పొడి చేయండి. ఆ పొడిని ఒక కప్పు నీటి లో రాత్రి నానబెట్టండి. ఆ నీటిని ఉదయాన్నే తాగేయండి. మీకు కావాలంటే దీంట్లో తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.

3. మైగ్రేన్ నొప్పి తగ్గడానికి ఒక గ్లాసు నీటిలో ¼ స్పూన్ లవంగం పొడిని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. ఇలా 2. నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మైగ్రేన్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.

నివారణ చర్యలు..

1. మైగ్రేన్ సమస్య ఎక్కువకాలం ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యాన్ని ప్రేరేపించే వ్యాయామాలు చేయాలి.

2. క్రమం తపప్కుండా సమతుల ఆహారం తీసుకోవాలి. మైగ్రేన్ ట్రిగ్గర్ ఆహారాలు ఆహరాలు అయిన కెఫిన్, చాక్లెట్, అధిక ఉప్పు మొదలైనవి నివారించాలి.

3. చల్లని, వేడి నీటి స్నానం మైగ్రేన్ నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. స్నానం చేసేటప్పుడు చల్లని నీరు, వేడి నీరు రెండింటిని ఒకదాని తరువాత ఒకటి పోసుకుంటూ స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగయ్యి మైగ్రేన్ తగ్గుతుంది.

ఆయుర్వేద వైద్యుడు
డాక్ట‌ర్‌ వెంక‌టేష్‌

93928 57411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -