end
=
Saturday, April 19, 2025
సినీమావెండితెర తార‌ `అభిన‌య` వివాహం !
- Advertisment -

వెండితెర తార‌ `అభిన‌య` వివాహం !

- Advertisment -
- Advertisment -

నేనింతే, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శంభో శివ శంభో, ఢ‌మ‌రుకం వంటి చిత్రాల‌తో అల‌రించింది న‌టి అభిన‌య(Actress Abhinaya). పుట్టుక‌తో బ‌ధిరురాలు(Deaf and dumb) అయిన‌ప్ప‌టికీ త‌న అస‌మాన ప్ర‌తిభ‌(Versatile Performance)తో న‌ట‌న‌లో రాణిస్తున్న‌ది. ఒక్క తెలుగులోనే కాక ద‌క్షిణాది చ‌ల‌న చిత్రా(South Indian Pictures)ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ది. త‌న కెరీర్‌లో ఆమె ఎక్కువగా హీరోలకు సోదరి పాత్ర పోషించింది. తాజాగా మ‌ళ‌యాళంలో జొజూ జార్జితో క‌లిసి `ప‌ని` చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ది అభిన‌య‌. ఈ చిత్రంలో త‌న అభిన‌యానికి విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఆమె ఇప్పుడి వివాహ బంధం(Marriage Life)లో అడుగుపెట్టింది. కొద్దిరోజుల క్రిత‌మే త‌న‌కు కాబోయే భ‌ర్త హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్‌ (సన్నీ వర్మ)(Bride Groom Sunny Varma) ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న‌ది. గ‌త నెల‌లో వారిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. బుధ‌వారం జూబ్లీహిల్స్‌ జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో వారి వివాహ వేడుక జరిగింది. ఈ నెల 20న వారిద్ద‌రి రిసెప్షన్ జ‌రుగ‌నున్న‌ది. ఇక పెండ్లి త‌ర్వాత అభిన‌య త‌న సినిమా కెరీర్ కొన‌సాగిస్తుందా.. లేదా అనేది ఇక ముందు చూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -