end
=
Saturday, April 19, 2025
వార్తలురాష్ట్రీయంకాసేపు కుంచె చేత‌బూని.. చిత్ర‌కారిణిగా క‌విత‌ !
- Advertisment -

కాసేపు కుంచె చేత‌బూని.. చిత్ర‌కారిణిగా క‌విత‌ !

- Advertisment -
- Advertisment -

వ‌రంగ‌ల్ స‌మీపంలోని ఎల్క‌తుర్తి(Elkathurthi)లో ఈ నెల 27న అట్ట‌హాసంగా బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ (Brs Silver Jubilee Meeting)జ‌రుగ‌నున్న‌ది. స‌భ స‌న్నాహాక స‌మావేశాల్లో భాగంగా బుధ‌వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC Kavitha)క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌గిత్యాలలో ప‌ర్య‌టించారు. వీధుల్లో న‌డ‌యాడుతూ.. ఇంటింటికీ వెళ్లి పార్టీ వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. అనంత‌రం జ‌గిత్యాల తెలంగాణ చౌర‌స్తాలో చిత్ర‌కారులు(Publicity Designers) బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన వాల్ రైటింగ్ (Wall writing)రాస్తుండ‌గా ఆమె వారిని ప‌ల‌క‌రించారు. అనంత‌రం ఆమె కుంచె చేత‌బూని కేసీఆర్ అనే ఇంగ్లిష్ అక్ష‌రాల్లో గులాబీ రంగు నింపి సంద‌డి చేశారు. త‌న తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ అక్ష‌రాల‌కు రంగులు అలుముతూ పుల‌కించిపోయారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -