అది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని మిడ్ మానేరు(Mid Maneru). రోజులాగానే జాలరి (Fisherman)గోలాడ నరేశ్ శనివారం గోదావరిలో చేపల వల(Hunting net) వేశాడు. వల లాగుతుండగా ఒక్కసారిగా బరువుగా అనిపించింది. దీంతో నరేశ్ వెంటనే వలను పైకి లాగాడు. వలలో చిక్కిన పె……ద్ద చేప(Big fish caught)ను చూసి అవాక్కయ్యాడు. ఆ చేప ఒక కిలో రెండు కిలోలు కాదు.. ఏకంగా 32 కిలోల బరువుంది. అంతపెద్ద చిక్కినందుకు జాలరి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కిలో ఒక్కింటికి తక్కువలో తక్కువ రూ.100 చొప్పున రేటు వేసుకున్నా తనకు రూ.3 వేల ఆదాయం వస్తుందని తెలిపాడు.
ఆ పెద్ద చేపను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి కనబరిచారు. ఇంతకీ వలకు చిక్కిన చేప పేరుంటో తెలుసా..? బొచ్చె రకానికి చెందినదట. స్థానికం ఆ రకం చేపను కట్ల చేప అని కూడా పిలుస్తారట.