ఆఫ్రికా ఖండంలో(African continent)ని బోట్వ్సానా నుంచి భారత్‌కు ఎనిమిది చీతాలు(Eight Cheetahs) రానున్నాయి. ఈ చీతాలను రెండు విడుతల్లో తీసుకురానున్నారు. మేనెలలో మొదటి విడుత(First face)లో నాలుగు చీతాలు రానున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్‌టీసీఏ)(National tiger conservative authority) సమాచారం ఇచ్చింది. కేంద్ర అటవీశాఖ(Central forest minister) మంత్రి భూపేంద్ర యాదవ్, ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ప్రాజెక్ట్ చీతా సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయం వెల్లడించారు.
భారత్‌లో ప్రాజెక్ట్ చీతా కోసం ఇప్పటికే రూ. 112 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు.ఈ నిధుల్లో సింహభాగం మధ్యప్రదేశ్‌లో చీతాల పునరావాసానికే ఖర్చు చేశామని ఎన్‌టీసీఏ అధికారులు పేర్కొన్నారు. ‘దక్షిణాఫ్రికా, కెన్యా, బోట్వ్సానా దేశాల నుంచి భారత్‌కు మరిన్ని చీతాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. బోట్వ్సానా నుంచి ఎనిమిది చీతాలను రెండు విడుతల్లో తీసుకురానున్నాం. మొదటి విడుతలో బొట్వ్సానా నుంచి ఈ మేలో నాలుగు చీతాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచించాం. ఆ తర్వాత మరో నాలుగు చీతాలను కూడా తీసుకొస్తాం.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రస్తుతం చిరుతలను కూనో నేషనల్ పార్క్ నుంచి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యానికి (Wild life sanctuary)దశలవారీగా తరలించనున్నట్టు వెల్లడించారు. రాజస్థాన్ మధ్య అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది’ అని ఎన్‌టీసీఏ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కూనో జాతీయ పార్కులో 26 చీతాలు ఉన్నాయని, వాటిలో 16 బహిరంగ అడవుల్లో, 10 ఎన్‌క్లోజర్లలో ఉన్నట్టు వివరించారు.
ఆడ చీతాలు జ్వాలా, ఆశా, గామిని, వీరా పిల్లలకు జన్మనివ్వడంతో చీతాల సంఖ్య 26కు చేరుకుంది. కునోలో చీతా సఫారీ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2022లో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను కునో నేషనల్ పార్కులో వదిలారు. వాటిల్లో ఐదు ఆడచీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి.