ఎదిగే వయసులో పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి. అయితే.. ఏది పడితే అది కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలు, పండ్లు అందిస్తే మరీ మంచిది. ఆయుర్వేదిక్ గుణాలున్న ఈ కింది ఇంగ్రీడియంట్స్ రోజువారీ మెనూలో ఉంటే మరీ మంచిది. అవేంటో తెలుసుకుందామా!
అవకాడో:
అవకాడో(Avocado)లు మెదడులోని రక్తం గడ్డటాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో కే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుది. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడుకు ఎలాంటి స్ట్రోక్ రాకుండా ఉండేందుకు అవకాడో బాగా ఉపయోగపడుతుంది.
బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్లో(Blue berries) చాలా పవర్ ఫుల్ ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు చాలా మేలు చేస్తాయి. మెదడుకు సంబంధించిన కణాల వాపు తగ్గించడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల బ్లూబెర్రీస్ ను ఎక్కువగా తింటూ ఉండాలి.
పసుపు:
పసుపు(Turmeric Powder) మెదడు కణాలకు సంబంధించిన వాపును తగ్గించడానికి పసుపు బాగా పని చేస్తుంది. ఇవి డీఎన్ ఏపై ప్రభావం చూపుతాయి. ఇందులో యాంటీ డిప్రెస్సెంట్లుగా పనిచేసే పలు ఔషధాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి. పసుపు మనం నిత్యం ఆహారాల్లో తీసుకుంటూనే ఉంటాం. దీని ఉపయోగం తెలుసుకుని మరింత ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి.
గుడ్లు:
వీటిలో(Eggs) కొలైన్ అధికంగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్లకు చాలా అవసరం. పాస్పోలిపిడ్స్ గుడ్డులో అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. ఇందులోని పోషకాలు మెదడులోని కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ లో పాలిఫేనోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆమ్లజనకాలు మెదడు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల ఎక్కువగా దీన్ని వినియోగిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. అలాగే మంచి మెమొరీ వస్తుంది. దీంట్లో ఉండే ఓలియోకెంథాల్ అనే రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది. మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా చూస్తుంది.
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
93928 57411