మీ వద్ద రూ.500 నోటు(Currency notes) ఉందా? అయితే.. వెంటనే ఆ నోటు ఒరిజనల్ లా? కాదా? (Original or not)చెక్ చేసుకోండి. కరెన్సీ నోట్లపై తాజాగా కేంద్ర హోంశాఖ(Central Home dept) కీలక సూచనలు చేసింది. అలాగే ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీబీఐ, సెబీ, బ్యాంకులను సహా అనేక శాఖలను సైతం అప్రమత్తం చేసింది. దేశంలో రూ.500 నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని, ఆ నోట్లపై అక్షర దోషాలు ఉంటాయని పేర్కొన్నది. ప్రతిఒక్కరూ జాగ్రత్త వ్యవహరించాలని ఆర్బీఐ సైతం హెచ్చరికలు జారీ చేసింది.
నోటుపై ఉన్న రిజర్వ్ `బ్యాంక్ ఆఫ్ ఇండియా` అనే ఇంగ్లిష్ అక్షరాల్లో రిజర్వ్ (RESERVE) అనే చోట E అక్షరం బదులు A ముద్రించి ఉంటుందని వెల్లడించింది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప రూ.500 నోటుపై తప్పును అస్సలు గమనించలేరని తెలిపింది. నకిలీ నోట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.