గాయాలు, పుండ్లు(Wounds) అయిన వారు పప్పు(Lentils) తినవచ్చా.. తింటే చీము(pus) పడుతుందా ? దానిలో నిజమెంత ? అంటే.. భేషుగ్గా పప్పు తినవచ్చు. గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందనేది నిజం కాదు. అలాంటి స్థితిలో పప్పు తింటేనే ఒంటికి మంచిది.ఎందుకంటే పప్పులో ప్రోటీన్లు(Heavy Proteins) పుష్కలంగా ఉంటాయి. అవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. అందువల్ల గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పును నిరభ్యంతరంగా తినవచ్చు.
మరి చీము ఎందుకు పడుతుందంటే.. గాయం లేదా పుండులోని సూక్ష్మ క్రిములతో తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి. చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము. ఇన్‌ఫెక్షన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేదంటే దుమ్మూ ధూళి అంటుకుని ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది.
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
93928 57411