ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో పుట్టిన శిశువు(Infant)కు యాజమాన్యం కానుక ప్రకటించింది. ఆ బుడ్డోడు జీవితాంతం(Life long) ఆర్టీసీ బస్సులో ఉచితం ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సువర్ణ అనే నిండు గర్భిణి(Pregnant Lady) ఈనెల 15న ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెకు ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఆశ కార్యకర్త మల్లికాంతమ్మ అప్రమత్తమైంది. ప్రయాణికులను వెంటనే కిందికి దింపేసి గర్భిణికి పురుడు పోసింది.
సువర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కష్టకాలంలో గర్భిణికి అండగా కండక్టర్ రాజ్‌కుమార్, బస్సు డ్రైవర్ వేణుగోపాల్, ఆశ కార్యకర్త మల్లికాంతమ్మను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్‌కు పిలిపించి మరీ సన్మానించారు. ఏదేమైనా బస్సులో పుట్టిన బుడ్డోడు మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశాడు కదూ!