గురువు(Teacher)ను దైవంగా భావించాలని పెద్దలు చెప్తుంటారు. తల్లిదండ్రుల ఆ తర్వాతి స్థానం గురువుదే అంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు దిగి వచ్చినా.. మనం మాత్రం గురువుకే నమస్కరించాలంటారు. కానీ.. మనం ఏమాత్రం ఊహించని విధంగా ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం(Visakapatnam)లో ఓ దారుణం జరిగింది. అధ్యాపకురాలిని ఓ విద్యార్థిని(Student) చెప్పుతో కొట్టింది. అసలేమైందంటే.. రఘు కాలేజీలో చదువుతున్న విద్యార్థిని మొబైల్(Mobile)ను అధ్యాపకురాలు తీసుకున్నది. కారణం ఏమిటో తెలియదు. ఈ విషయంలో ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది.
తన ఫోన్ 12 వేలు అంటూ విద్యార్థిని టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. `నా ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా.. అంటూ విద్యార్థిని కాలికున్న చెప్పు తీసింది. టీచర్ `ఇవ్వను` అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..