ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం(Chattishgarh Forest)లో తుపాకుల మోత(Gun firing) మోగింది. మొన్నటికి మొన్నచోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత(Maoist top leader) మాంఝీ మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం బీజాపూర్ జిల్లాలో ని భేదారి అటవీప్రాంతంలో మళ్లీ మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. కాల్పుల్లో గుండిపురి మావోయిస్ట్ పార్టీ కమాండర్ వాచమ్ మృతిచెందాడు. ఇతడికి అనేక విధ్వంసాల(Bomb blasting)తో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వాచమ్ తలపై రూ.3 లక్షల రివార్డ్ ప్రైజ్ ఉంది. వాస్తవానికి ఈ కూంబింగ్ మావోయిస్ట్ పార్టీ మాస్టర్ మైండ్ హిడ్మా కోసం జరిగింది. ఆయన్ను పట్టకునే క్రమంలో మిగతా మావోయిస్టులు కూడా పోలీసులకు చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరింత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్యను అక్కడి పోలీస్ వర్గాలు ధ్రువీకరించాల్సి ఉన్నది.