వెన్ను నొప్పికి తక్షణ ఉపశమనం అందించే సహజ ఆయుర్వేద ఔ|షధాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి
1. కొబ్బరినూనెను కొద్దిగా తీసుకునిddd అందులో కర్పూరం వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. దాన్ని సీసాలో నిల్వ చేసుకుని రోజూ వెన్నుపై మర్దనా చేయాలి. దీంతో కొద్ది రోజుల్లోనే వెన్ను నొప్పి తగ్గుతుంది.
2. స్నానం చేసేందుకు వాడే గోరు వెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో కేవలం వెన్ను నొప్పి మాత్రమే కాదు, శరీరంలో ఉండే ఇతర నొప్పులు కూడా తగ్గుతాయి.
3. సముద్రపు ఉప్పును వేడి చేసి దాన్ని ఒక వస్త్రంలో చుట్టి దాంతో కాపడం పెడితే.. ఎంతటి నొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుంది.
4. ఆవనూనెను కొద్దిగా వేడి చేసి దాంతో వెన్నుపై బాగా మర్దనా చేయాలి. అనంతరం వేడినీటితో స్నానం చేయాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
5. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, కొంత తేనెలను బాగా కలిపి రాత్రి నిద్రించడానికి ముందు తాగితే ఎలాంటి నొప్పి అయినా తగ్గుతుంది.
6. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. అల్లంతో టీ చేసుకుని తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. హెర్బల్ ఆయిల్‌తో వెన్నుపై బాగా మర్దనా చేసి అనంతరం వేడి నీటితో స్నానం చేయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది.
8. బియ్యాన్ని కొద్దిగా వేడి చేసి వస్త్రంలో చుట్టి దాంతో కాపడం పెట్టుకున్నా.. వెన్ను నొప్పి తగ్గుతుంది.
గమనిక: ఈ చిట్కాలు తక్షణ ఉపశమనం ఇస్తాయి, కానీ శాశ్వత పరిష్కారం కోసం ఈ చిట్కాలతో పాటు సంధి వర్ధన తప్పనిసరి. సంధి వర్ధన మీరే స్వయంగా ఇంట్లో తయారీ విధానాన్ని మేము ఇప్పటికే పలు మార్లు వివరించాం. మళ్లీ ఫార్ములా కావాలంటే పర్సనల్‌గా మెసేజ్ చేయండి 9392857411 అందిస్తాము.లేదా తయారు చేసుకోలేకపోతే, ఆర్డర్ ఇవ్వండి(939285741).మేమే మిశ్రమం తయారు చేసి పంపిస్తాం.
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
9392857411