వరంగల్(Warangal) సమీపంలోని ఎల్కతుర్తి(Elkathurthi)లో బీఆర్ ఎస్ రజోత్సవ సభ(BRS silver jubilee)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు సభ జరుగనున్నది. సభకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(BRS chief KCR) విచ్చేసి ప్రసంగించనున్నారు. పార్టీ పాతికేళ్ల ప్రస్థానంలో భాగంగా ఎత్తు పల్లాలు, విజయ పరాభవాలను మరోసారి గుర్తుచేసుకోనున్నారు. అంతేకాదు.. ఒకటిన్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై మొదటి సారి బాక్పాణాలు ఎక్కుపెడతారనే చర్చ కూడా నడుస్తున్నది.
ఆయన ఎవరిపై .. ఎలాంటి అస్త్రాలు సంధిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. 1,300 ఎకరాల్లో సభాస్థలం ఏర్పాటైంది. 1,500 మంది వలంటీర్లు కార్యకర్తలు, సభకు విచ్చేసిన ప్రజలకు సేవలందించనున్నారు. రాష్ట్ర నలమూలల నుంచి 3 వేల బస్సుల్లో సభకు విచ్చేయనున్నారు. 23 భారీ ఎల్ ఈడీ స్క్రీన్ల ద్వారా ఆహూతులు సభను వీక్షించవచ్చు. 50 వేల వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్,
ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ ఏర్పాట్లను పూర్తి చేశారు.