- ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రష్యా
కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న జబ్బు. కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం అన్ని అగ్ర దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే రష్యా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ వాక్సిన్‌ను గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కలిసి తయారు చేసినట్లు, ఈ వ్యాక్సిన్ ఇప్పుడు రష్యా ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు రష్యా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
అయితే భారత్‌లో కూడా ఈ వాక్సిన్‌ను వివిధ దశలలో పరీక్షించి ఇండియా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు, దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు నీతి అయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు. ఇండియాలోని పలు మెడిసిన్ కంపెనీలు ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలావుంటే బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిపైన్స్, సౌదీఅరేబియా దేశాలలో రష్యా టీకాను అనుమతించినట్లు తెలిసింది.