- సముద్ర తీర ప్రాంతాల మీద తుఫాన్ ప్రభావం
సెప్టెంబర్ 11 నుంచి నెలాఖరు వరకు దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ర్ట, కేరళ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని, దీని వల్ల దేశమంతట వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. తీర ప్రాంతాలలో అధిక వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య
గురువారం నుండి శనివారం వరకు దక్షిణ కర్ణాటక, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. తూర్పు కర్ణాటక – అరేబియా సముద్ర తీర ప్రాంతాల మీద తుఫాన్ ప్రభావం అధికంగా ఉండబోతున్నట్లు వివరించారు. కేరళ, అస్సాం, కర్ణాటక, మేఘలయాలలో ఆరెంజ్ రంగు కేటగిరీ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే ఆయా ప్రాంతాలలో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read….