వెబ్ డెస్కు : బొడ్డెమ్మకు ప్రస్తుతం అధిక మాసంతో సంబంధం లేదు. భాద్రపద బహుళ సప్తమి రోజు నుంచి బొడ్డెమ్మను అమావాస్య వరకు తొమ్మిది రోజులు ఆడుతారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం తేది 09-09-2020 బుధవారం రోజు నుంచి తేది. 17-09-2020 గురువారం వరకు జరుపుకోవచ్చు. అలాగే బతుకమ్మ పండుగ విషయంలో కూడా భాద్రపద బహుళ అమావాస్య మహాళయ అమావాస్య పర్వదినం తేది. 17-09-2020 గురువారం కనుక మన సంప్రదాయం అనుసరించి ఆ రోజునే (ఎంగిలిపూలు) తొలి బతుకమ్మను పేర్చాలి.
జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు
తెల్లవారి నుంచి అధిక మాసం కనుక నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి తేది.17-10-2020 శనివారం నుంచి రెండవ బతుకమ్మను పేరువాలి. అలా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవాలి. ఇరవై సంవత్సరముల క్రితము కూడా ఇదే విధముగా ఆశ్వీయుజ మాసము వృష నామ సంవత్సరంలో అధికం రావడంతో బతుకమ్మ పండుగను అప్పట్లో ఇలాగే నిర్ణయించి జరుపుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ పండుగను ఇలాగే జరుపుకోవడం ఉత్తమమం..
– ఓ వేద పండితుడు