end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంసిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం
- Advertisment -

సిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం

- Advertisment -
- Advertisment -
  • వెలగపూడి ఎస్‌బిఐ నుండి రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేయబోయిన మోసగాళ్లు
  • ఎస్‌.బి.ఐ అధికారుల అప్రమత్తతతో భారీ మోసానికి చెక్‌

నకిలీ చెక్కులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి భారీ మొత్తంలో నిధులు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో బెడిసికొట్టింది. కొందరు ఘరానా మోసగాళ్లు ఏకంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అకౌంట్‌ నుండి సుమారు రూ.117.15 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించి చివరి నిమిషంలో బ్యాంకు అధికారుల అప్రమత్తతో భారీ మోసానికి చెక్‌ పడింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని వెలగపూడిలోని భారతీయ స్టేట్‌ బ్యాంకులో సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి అకౌంటు ఉంది.

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి

అయితే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సంబంధించి రూ.52,65,00,000 విలువ గల చెక్‌ను కర్ణాటకలోని మంగళూరు బ్రాంచిలో విత్‌డ్రా చేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్రాంచి అధికారులు చెక్‌ను పాస్‌ చేసే క్రమంలో, పెద్ద అమౌంటు కాబట్టి ఒకసారి వెలగపూడి బ్రాంచికి ఫోన్‌ చేసి నిర్ధారించుకున్నారు. అయితే అంత పెద్ద మొత్తం చెక్‌ ఎవరికీ ఇవ్వలేదని వెలగపూడి బ్రాంచి బ్యాంకు అధికారులు మంగళూరు బ్రాంచి అధికారులకు తెలపడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఆ చెక్కును పాస్‌ చేయవద్దని ఆదేశించారు.

సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…

దాంతో ఎస్‌బిఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని ఇతర ప్రాంతీయ బ్రాంచిల అధికారులను అప్రమత్తం చేశారు. ఇదేగాకుండా ఢీల్లీలోని ఎస్‌బిఐ సిసిపిసి-1 బ్రాంచ్‌లో రూ.39,85,95,540 విలువ గల సిఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ను విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించారు. అక్కడి బ్యాంకు అధికారులు కూడా వెలగపూడి బ్రాంచికి ఫోన్‌ చేసి నిర్ధారించుకోగా అది కూడా నకిలీ చెక్కు అని తేలింది. అయితే కోల్‌కతాలో కూడా మోగ్రాహట్‌ ఎస్‌బిఐ బ్రాంచిలో రూ.24,65,00,000 విలువ గల సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కును విత్‌డ్రా చేయబోయారు. అది కూడా నికలీ చెక్కు అని తేలింది. దీంతో మూడు చోట్ల మొత్తం రూ.117.15 కోట్ల రూపాయలను సిఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల ద్వారా విత్‌డ్రా చేయబోయారు మోసగాళ్లు.

తెలంగాణలో రోడ్డెక్కెనున్న సిటీ బస్సులు?

అయితే ఇది చాలా పెద్ద ఘరానా మోసగాళ్ల పనే అని, దీని వెనకాల పెద్ద ముఠా ఉందని ఎస్‌బిఐ ఉన్నతాధికారులు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంత పకడ్బందీగా చెక్కులను ఎలా రూపొందించారో అర్థం కావడం లేదని, బహుళా సిఎంఆర్‌ఎఫ్‌ ఉద్యోగులు సహకారం కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -